Moviesఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం.. స్టార్ హీరో భార్య మృతి

ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం.. స్టార్ హీరో భార్య మృతి

ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విజయ రాఘవేంద్ర భార్య స్పందన గుండె పోటుతో మరణించారు. బ్యాంకాంగ్ పర్యటనలో ఉన్న ఆమెకు హార్ట్ ఎటాక్ రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఈరోజు ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. విజయ రాఘవేంద్ర కన్నడ కంఠ‌రీవ‌ రాజకుమార్ మేనల్లుడు.

బాల నటుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆ తర్వాత దర్శకుడుగా కూడా పనిచేశారు. 2007లో స్పందనను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. స్పందన విశ్రాంత సీనియర్ పోలీసు అధికారి బికే శివరాం కుమార్తె కావటం విశేషం.

స్పంద‌న మ‌ర‌ణ‌వార్త తెలిసిన వెంట‌నే బెంగ‌ళూరులో ఉన్న విజ‌య్‌తో పాటు కుటుంబ స‌భ్యులు బ్యాంకాక్‌కు బ‌య‌లు దేరి వెళ్లారు. ఇక 2016లో రవిచంద్రన్‌ ‘అపూర్వ’ చిత్రంలో విజ‌య్ రాఘ‌వేంద్ర‌తో పాటు త‌న భార్య స్పంద‌న కూడా న‌టించారు. స్పంద‌న మృతితో విజ‌య్‌కు ప‌లువురు క‌న్న‌డ సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news