Moviesభానుప్రియ చెల్లి శాంతిప్రియ‌ను టార్చ‌ర్ పెట్టిన స్టార్ హీరో.. త‌క్కువ సినిమాల‌తోనే...

భానుప్రియ చెల్లి శాంతిప్రియ‌ను టార్చ‌ర్ పెట్టిన స్టార్ హీరో.. త‌క్కువ సినిమాల‌తోనే ఇండ‌స్ట్రీ నుంచి అవుట్‌..!

హీరోయిన్ భానుప్రియ తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా గుర్తుండే ఉంటుంది. తెలుగులో అంద‌రూ స్టార్ హీరోల‌తో ఎన్నో హిట్ సినిమాల‌లో న‌టించిన ఆమె భరతనాట్యం, చారడేసి కళ్లు.. ఆమె అభినయం తెలుగు సంప్రదాయాన్ని పాటించిన తీరుకు తెలుగు ప్రేక్షకులు పెద్ద అయిపోయారు. భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ కూడా తెలుగులో హీరోయిన్గా చేసింది. అయితే తమిళం, హిందీలో వచ్చినన్ని ఛాన్సులు ఆమెకు ఇక్కడ రాలేదు. కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శాంతిప్రియ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై సంచలన కామెంట్లు చేశారు.

అక్షయ్‌ గతంలో తనను బాడీ షేవింగ్ చేశాడని వాపోయింది. అక్షయ్ – శాంతిప్రియ కలిసి ఇక్కె పే ఇక్కా సినిమాలో నటించారు. ఓ మిల్లులో షూటింగ్ జరుగుతుండడం… గ్లామర్ పాత్ర‌ కావడంతో హీరోయిన్ శాంతి ప్రియ పొట్టి బట్టలు వేసుకుని ఉందట. దీంతో ఆమె మోకాలు బయటకు కనిపిస్తోంది.. అది చూసిన అక్షయ్ ఏమైంది ? మోకాలికి దెబ్బ తగిలిందా అంత నల్లగా ఉన్నాయి ఏంటి ? అని కామెంట్ చేశాడని దీంతో సెట్ లో ఉన్న వాళ్ళు అందరూ తనని చూసి నవ్వేరని వాపోయింది.

ఆ సమయంలో నాకు 22 – 23 సంవత్సరాలు ఉంటాయి.. అక్షయ్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ వల్ల డిప్ర‌ష‌న్‌కు గురయ్యాను.. ఆ సమయంలో మా అమ్మ నాకు అండగా నిలబడింది.. నేను మాత్రమే కాదు అక్క భానుప్రియ కూడా ఇలాంటివి ఫేస్ చేసిందని శాంతిప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా నార్త్‌లో కొన్ని మ్యాగజైన్స్ అయితే ముఖంపై మొటిమల సంఖ్యను బ‌ట్టి భానుప్రియ తన సినిమాలకు పారితోషం తీసుకుంటుందని కూడా రాసుకు వచ్చారని చెప్పింది.

తన స్కిన్ కలర్ పై అప్పట్లో కామెంట్ చేసిన అక్షయ్ కుమార్ ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని శాంతిప్రియ పేర్కొంది. ఇక 1994 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శాంతి ప్రియ 20 సంవత్సరాల తర్వాత 2014లో రీయంట్రీ ఇచ్చి ప్రస్తుతం హిందీలో పలు సీరియల్ చేస్తూ బిజీగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news