Moviesఆ టాలీవుడ్ హీరోతో ర‌జ‌నీ మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్‌…!

ఆ టాలీవుడ్ హీరోతో ర‌జ‌నీ మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్‌…!

ఇపుడు కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా జైల‌ర్‌. ఈ సినిమా ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 450 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. కేవ‌లం ఆరు రోజుల్లోనే ఈ సినిమా ఈ స్థాయిలో వ‌సూళ్లు సాధించింది. ర‌జ‌నీ కెరీర్‌లోనే చాలా రోజుల త‌ర్వాత ఇంత గొప్ప హిట్ రావ‌డంతో ర‌జ‌నీ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

జైల‌ర్ ఉగ్ర‌రూపం ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. ఈ సినిమా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టించారు. ఇదిలా ఉంటే ర‌జ‌నీ నెక్ట్స్ చేయ‌బోయే సినిమాల్లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు టి జ్ఞాన‌వేల్ కాంబినేష‌న్లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఈ భారీ బ‌డ్జెట్ సినిమాలో ఓ టాలీవుడ్ కుర్ర హీరో కూడా న‌టిస్తున్నాడ‌న్న ప్ర‌చారం బాగా న‌డిచింది. ఆ హీరో ఎవ‌రో కాదు నేచురల్ స్టార్ నాని కావ‌డం విశేషం. అయితే ఇప్పుడు నాని ప్లేస్‌లో మ‌రో టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ ను నాని ప్లేస్‌లో తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. శ‌ర్వానంద్ కూడా ఈ సినిమాలో న‌టిస్తే తెలుగులో ఈ సినిమాకు మంచి క్రేజ్ రావ‌డం ఖాయం. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news