Moviesఖుషి ఈవెంట్లో నాగ‌చైత‌న్య‌ను త‌లుచుకుని క‌న్నీళ్లు పెట్టుకున్న స‌మంత ( వీడియో...

ఖుషి ఈవెంట్లో నాగ‌చైత‌న్య‌ను త‌లుచుకుని క‌న్నీళ్లు పెట్టుకున్న స‌మంత ( వీడియో )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగచైత‌న్య‌ హీరోగా ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి సూపర్ హిట్లు ఇచ్చిన సమంత తన తొలి సినిమా హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

మనస్పర్ధలు కారణంగా పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. విడాకుల తర్వాత కూడా సమంత ఎక్కడా ? వెనక్కి తగ్గకుండా సినిమాల్లో నటిస్తోంది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లలో కూడా హాట్ హాట్ గా కనిపిస్తోంది. ఇటు వెబ్ సిరీస్ లలోను రెచ్చిపోతుంది. తాజాగా ఆమె విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఖుషి మూవీ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో సింగర్ నాగచైతన్య – సమంత కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా మజిలీలో సాంగ్ పాడడంతో సమంత ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. మజిలీ సినిమా సమంత – చైతు పెళ్లి అయ్యాక తెరకెక్కింది. వీరిద్దరూ భార్యాభర్తలు గా ఉంటూ ఈ సినిమాలో నటించిన విశేషం.

సింగ‌ర్ మజిలీ సినిమాలో సాంగ్ పాడుతుండడంతో సమంత తన కన్నీళ్లు కంట్రోల్ చేసుకుంటూ నాగచైతన్యను తలుచుకుని అప్పటి జ్ఞాపకాలతో ఒక్కసారిగా ఎమోషనల్ అయినట్టు కనపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా సామ్ ఇంకా చైతు జ్ఞాపకాలను మర్చిపోలేక పోతుందా ? వీరు మళ్ళీ కలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news