Moviesసెన్సేషన్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ ఫిక్స్.. బాహుబలి కి అమ్మ...

సెన్సేషన్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ ఫిక్స్.. బాహుబలి కి అమ్మ మొగుడి లాంటి హిట్ కన్ఫామ్..!!

హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. కానీ ఆయనకు డిమాండ్ మాత్రం పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా బడా డైరెక్టర్లు కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

ప్రభాస్ కూడా మంచి కథ కంటెంట్ దొరికితే భాష ఏదైనా సరే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రభాస్ . ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు ప్రభాస్ అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ మధ్యకాలంలో లోకేష్ కనగరాజ్య్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో తెలిసిందే .

మొదటగా మాస్టర్ ఆ తర్వాత విక్రమ్ సినిమాలతో కోలీవుడ్ సినీ చరిత్ర తిరగ రాసిన ఈయన త్వరలోనే లియో సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు . అయితే ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజు ప్రభాస్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు అంటూ నెట్టింట వార్తలు తెగ వైరల్ గా మారాయి . ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అంతేకాదు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా సౌత్ ఇండియన్ యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ని ఫిక్స్ చేసుకున్నారట . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news