Moviesపడిపోయిన నరేష్ పరువును పైకి లేపిన పవిత్ర.. ఒక్క దెబ్బతో తల...

పడిపోయిన నరేష్ పరువును పైకి లేపిన పవిత్ర.. ఒక్క దెబ్బతో తల ఎత్తుకునేలా చేసేసిందిగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ పేరు ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఈయన పేరు హీరోగా .. సూపర్ స్టార్ గా ..మంచి టాలెంటెడ్ ఉన్న నటుడిగా జనాలు చెప్పుకునే వాళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో మరి ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురికి విడాకులు ఇచ్చేయడం ఆయనకు నెగిటివ్గా మారింది . అంతేకాదు ఈయన రీసెంట్గా కన్నడ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు . దీనికి సంబంధించిన విషయాలను ఆయనే ఓపెన్గా చెప్పుకొచ్చాడు.

అంతే కాదు వీళ్ళ కాంబోలో “మళ్లీ పెళ్లి ” అనే సినిమా కూడా రిలీజ్ అయింది . ఈ సినిమా డిజాస్టర్ అయింది. అయితే అప్పట్లో నరేష్ పవిత్రలపై హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. కాగా ప్రెసెంట్ పవిత్ర చేసిన పని ఇప్పుడు నరేష్ తలెత్తుకునేలా చేసింది అంటున్నారు అభిమానులు . పవిత్ర లోకేష్ రీసెంట్గా తన మాతృభాష కన్నడ సాహిత్యంలో పి.హెచ్.డి చేయడానికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసింది .

అయితే ఈ ఎగ్జామ్ రాయడానికి స్వయాన నరేష్ ఆమెను ఎగ్జామ్ హాల్ కి తీసుకెళ్లడం గమనార్హం. ఎగ్జామ్ కోసం ప్రతి రూపాయి కూడా నరేష్ ఖర్చు చేశారు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే రీసెంట్గా ఈ ఎగ్జామ్ కి సంబంధించిన రిజల్ట్ రిలీజ్ అయ్యాయి . అయితే పవిత్ర లోకేష్ ఎగ్జామ్లో పాస్ అయింది . అంతేకాదు 910 మంది ఎగ్జామ్ రాస్తే కేవలం 250 మంది మాత్రమే ఈ పరీక్షలో పాస్ అయ్యారు.. అంటే ఈ ప్రశ్నలు ఎంత టఫ్ గా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఓ టఫ్ ఎగ్జాం ని కూడా నరేష్ కోసం కష్టపడి చదివి పాస్ అయ్యి ఆయన పరువును ప్రతిష్టను నిలబెట్టింది అంటున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే పవిత్ర నరేష్ ని తలెత్తుకునేలా చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నరేష్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news