Moviesవిచిత్రమైన పద్ధతిలో లావణ్య్-వరుణ్ ల పెళ్లి.. మెగా ఫ్యామిలీలోనే ఫస్ట్ టైం...

విచిత్రమైన పద్ధతిలో లావణ్య్-వరుణ్ ల పెళ్లి.. మెగా ఫ్యామిలీలోనే ఫస్ట్ టైం ఇలా..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగాస్టార్ చిరంజీవి అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు . మెగా ఫ్యామిలీ నుండి ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు అందరూ ఇప్పుడు లైఫ్ లో సెటిలైపోయారు . రీసెంట్ గానే లావణ్య త్రిపాఠితో నిశ్చితార్ధం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . నాగబాబు నివాసంలో అతి తక్కువ మంది బంధువులు – సన్నిహితులు – స్నేహితులు మధ్య వీళ్ల నిశ్చితార్ధం గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగింది .

నిజానికి నవంబర్లో వీళ్ళ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆ పెళ్లి ముహూర్తాన్ని ఆగస్టు చివరి వారంలో పెట్టుకునేలా మార్చుకున్నారు మెగా ఫ్యామిలీ అంటూ సినిమా ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది. దానికి తగ్గట్టే రీసెంట్గా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇటలీలో కలిసి తిరిగి న పిక్స్ వైరల్ అవ్వడంతో వీళ్ళ పెళ్లి పనుల కోసమే ఇటలీకి వెళ్లారు అన్న పుకార్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది .

లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ల పెళ్లి ఆగస్టు 25వ తేదీన ఇటలీలో గ్రాండ్గా జరగబోతుందని .. కానీ ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్క హీరో కూడా అటెండ్ అవ్వడం లేదని కేవలం మెగా ఫ్యామిలీ – లావణ్య ఫ్యామిలీ ..కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారని ..వాళ్లు కూడా 50 మంది లోపే హాజరయ్యేలా ఓ కండిషన్ పెట్టుకున్నారని తెలుస్తుంది. అంతేకాదు వీళ్ళ పెళ్లి ఇటలీలో జరిగిన తర్వాత హైదరాబాద్లో ఓ గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారట మెగా ఫ్యామిలీ.

అయితే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ లో పెళ్లి చేసుకున్న హీరోలలో అందరూ పెళ్ళికి దాదాపు వేలల్లోనే హాజరయ్యారు . స్టార్ సెలబ్రిటీస్ అందరు పెళ్ళికి హాజరై ఆశీర్వదించారు . అయితే నాగబాబు ఎందుకు ఇలా అందరికీ దూరంగా కొడుకు పెళ్లి చేస్తున్నాడు అనేది అర్థం కావడం లేదు . అంతేకాదు మెగా ఫ్యామిలీ వారసుడైన వరుణ్ పెళ్లి పరాయి దేశంలో చేయడం ఏంటి అనేది కూడా అభిమానులకి అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది . అయితే లావణ్య – వరుణ్ ల మధ్య ప్రేమ పుట్టింది ఇటలీలో నేనని.. అందుకే వాళ్ళ పెళ్లి అక్కడ చేసుకోవాలని ఇద్దరు ఆశపడుతున్నారని .. ఆ కోరికను కాదనలేక కుటుంబం కూడా దానికే ఓకే చెప్పిందట. అందుకే పెళ్లిని చాలా సింపుల్గా చేసి రిసెప్షన్ మాత్రం చాలా చాలా గ్రాండ్ గా ఇవ్వాలనుకుంటున్నారట . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news