Moviesనీ కంటే నేనే గొప్ప‌… నేనే నెంబ‌ర్ 1.. మ‌హేష్‌ను క‌వ్విస్తోన్న...

నీ కంటే నేనే గొప్ప‌… నేనే నెంబ‌ర్ 1.. మ‌హేష్‌ను క‌వ్విస్తోన్న బ‌న్నీ…!

ఏది ఏమైనా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ స్టార్ మహేష్ బాబును పదేపదే కవ్విస్తున్న పరిస్థితి ఉందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం బన్నీకి తాను గొప్ప అన్న ఫీలింగ్ బాగా వచ్చేసిందని అంటున్నారు. ఇది గత రెండు.. మూడేళ్లలో మరి ఎక్కువైందని అంటున్నారు. వాస్తవానికి బన్నీ మంచి నటుడు.. టాలెంట్ ఉంది.. గొప్ప డాన్సర్ అయితే కొన్ని హిట్లు పడటంతో పాటు ఇటు సౌత్‌లో మార్కెట్ పెరగటం… పుష్ప‌ సినిమాతో అటు పాన్ ఇండియా హీరోగా మారడంతో బన్నీ యాటిట్యూడ్ బాగా మారిందని అంటున్నారు.

వ‌రుసగా అలవైకుంఠపురంలో, పుష్ప లాంటి హిట్ సినిమాలు పడ్డాయి అలవైకుంఠపురంలో సినిమా రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా పోటీగా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల విషయంలో అభిమానుల మధ్య పెద్ద యుద్ధాలు జరిగాయి. చివరకు తుదిపోరులో బన్నీ సినిమా పై చేయి సాధించింది అప్పుడు మహేష్ కూడా కొంతవరకు పంతానికి పోయిన మాట నిజం అంటారు.

ఇక పుష్ప సినిమాతో బ‌న్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ త‌ర్వాత మ‌హేష్ స‌ర్కారువారి పాట క‌మ‌ర్షియ‌ల్‌గా బ్రేక్ ఈవెన్ ద‌గ్గ‌రే ఆగిపోయింది. ఇప్పుడు బ‌న్నీ పుష్ప 2 త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ క్ర‌మంలోనే పుష్ప 2తో పాన్ ఇండియా రేంజ్ హిట్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇక అల వైకుంఠ‌పురంలోకు మంచి మ్యూజిక్ ఇచ్చిన థ‌మ‌న్‌ను స‌ర్కారువారి పాట‌కు మ‌హేష్ ప్రిప‌ర్ చేశాడు.

అంత‌కుముందు స‌రిలేరు నీకెవ్వ‌రుకు మ్యూజిక్ ఇచ్చిన దేవిని మ‌హేష్ ప‌క్క‌న పెట్టాడు. అదే దేవిని బ‌న్నీ త‌న పుష్ప సినిమాకు తీసుకున్నాడు. త‌న‌కు దేవి స‌రిగా మ్యూజిక్ ఇవ్వ‌లేద‌ని ప‌క్క‌న పెడితే అదే దేవిని బ‌న్నీ తీసుకున్నాడు. ఇక స‌ర్కారువారి పాట‌కు థ‌మ‌న్ మ్య‌జిక్ బాగో లేద‌ని ప‌క్క‌న పెడితే ఇప్పుడు అదే థ‌మ‌న్‌ను బ‌న్నీ.. త్రివిక్ర‌మ్‌తో తీసే సినిమాకు పెట్టుకున్నాడు. బ‌న్నీ పంతం వేసి మ‌రీ థ‌మ‌న్ త‌న సినిమాకు తీసుకున్నాడ‌ట‌.

ఇక పుష్ప 2 సినిమాను కూడా మ‌హేష్ గుంటూరు కారం సినిమాకు పోటీగా వేయాల‌ని కూడా ప‌ట్టు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా బ‌న్నీ మ‌హేష్‌తో పోటీకి ప‌దే ప‌దే క‌వ్విస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. మ‌హేష్ కంటే తానే నెంబ‌ర్ 1 అని చూపించుకునే య‌త్నాలే చేస్తున్న‌ట్టుగా ఉంద‌ని ఇండ‌స్ట్రీ జ‌నాలు గుస‌గుస‌లాడుకుంటున్నారు. గ‌తంలో ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో పెట్టుకున్న బ‌న్నీ ఇప్పుడు మ‌హేష్ విష‌యంలో ప‌దే ప‌దే పోటీకి దిగుతుండ‌డంతో మ‌హేష్‌, బ‌న్నీ ఫ్యాన్స్ వార్ కూడా మామూలుగా ఉండేలా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news