Moviesలేడీ జ‌ర్న‌లిస్టు ప్రేమ‌లో మ‌హేష్‌బాబు… ఆమె కోస‌మే డాన్‌…!

లేడీ జ‌ర్న‌లిస్టు ప్రేమ‌లో మ‌హేష్‌బాబు… ఆమె కోస‌మే డాన్‌…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల – మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు – ఖ‌లేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 21 నుంచి ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ సారధ్యంలో ఈ సినిమా కోసం హై ఓల్టేజ్‌ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కథ ప్రకారం మహేష్ బాబు గుంటూరు డాన్ గా కనిపించబోతున్నట్టు సమాచారం.

సిటీలో జరిగే అన్యాయాలు.. అక్రమాలపై పోరాడుతున్న ఓ మహిళా జర్నలిస్టు ప్రేమలో మహేష్ బాబు ప‌డతాడని.. దీంతో ఆమెను కొందరు టార్గెట్ చేయడంతో ఆమె చిక్కుల్లో పడుతుంది. ఆమె లక్ష్యానికి ఆ డాన్ ఎలా ? అండగా నిలబడ్డాడు అన్నదే ఈ సినిమా కథ అని తెలుస్తుంది. ఇక సర్ ప్రైజ్ తో మహేష్ బాబు క్యారెక్టర్ ను త్రివిక్రమ్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది.

జర్నలిస్టు పాత్రలో మీనాక్షి చౌదరి.. మహేష్ బాబు మరదలుగా శ్రీ లీల కనిపించబోతున్నట్టు చెబుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ – సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థ‌మన్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news