Moviesజైల‌ర్ కోసం రు. 110 కోట్లు తీసుకున్న ర‌జ‌నీ కంటే ఆ...

జైల‌ర్ కోసం రు. 110 కోట్లు తీసుకున్న ర‌జ‌నీ కంటే ఆ స్టార్ హీరోయిన్ రెమ్యున‌రేష‌న్ ఎక్కువా…!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏ వయసులోనూ దూసుకుపోతున్నారు. ఆయన నటించిన జైలర్ సినిమా ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే రజిని కచ్చితంగా హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. రజినీకి జైలర్ సినిమా హిట్ అవ్వటం చాలా అవసరం. గత కొన్ని యేళ్ల‌లో రజిని సినిమాలు చేస్తున్న రజిని రేంజ్‌కు తగ్గ ఫిట్ అయితే రావడం లేదు. ఈ క్రమంలోనే జైలర్ సినిమాపై అంచినాలు బాగా ఉన్నాయి.

ఈ సినిమా కోసం రజనీకి ఏకంగా రు. 110 కోట్ల రెమ్యూనరేషన్ ముడుతున్నట్టు తెలుస్తోంది. దీనిని బట్టి రజిని రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మరి ఇంత రేంజ్ ఉన్న రజినీకంటే ఓ హీరోయిన్ కే ఎక్కువ పారితోష‌కం ఇచ్చారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ? ఆ సినిమా ఏదో చూద్దాం. కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ 1976లో బాలచందర్ దర్శికత్వంలో మూండ్రు ముడిచ్చు అనే సినిమా చేశారు. అంతకుముందు తెలుగులో వచ్చిన ఓ సీత సినిమాకు ఇది రీమేక్.

ఈ సినిమాలో నటించినందుకు గాను రజినికి కేవలం రు. 2000 రెమ్యునరేషన్ మాత్రమే ఇచ్చారట. ఇదే సినిమాలో హీరోయిన్గా చేసిన శ్రీదేవికి రు. 5000 ఇస్తే.. ప్రధాన పాత్రలో నటించిన కమలహాసన్ కు 30 వేలు ఇచ్చారట. అప్పటికే కమలహాసన్ ఫేమస్ కావడంతో ఇంత మొత్తం ఇచ్చారని శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అప్పట్లో రజనీకాంత్ కంటే శ్రీదేవి డబుల్ రెమ్యున‌రేష‌న్‌ తీసుకోవటం ఆశ్చర్యపరిచే విషయం. రజనీ – శ్రీదేవి కలిసి మొత్తం 18 సినిమాలలో నటించారు.

ఇక జైలర్ సినిమా విషయానికి వస్తే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజని విశ్రాంతి పోలీస్ అధికారిగా నటించారు. కుటుంబంతో కలిసి వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉండే ఈయన లైఫ్ లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. దీంతో సౌమ్యంగా ఉండే రజనీ కాస్తా యాక్షన్ లోకి దిగుతాడు. ఈ సినిమాలో రజనీకి జోడీగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ప్రధాన పాత్రలో కనిపించనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news