News' భోళాశంక‌ర్ ' డిజాస్ట‌ర్ అయినా త‌మ్ముడు రికార్డ్‌ను సేవ్ చేసిన...

‘ భోళాశంక‌ర్ ‘ డిజాస్ట‌ర్ అయినా త‌మ్ముడు రికార్డ్‌ను సేవ్ చేసిన చిరు…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తరికేసిన సినిమా పోకిరి. 2006 ఏప్రిల్ 28న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మహేష్ బాబుకి తిరుగులేని మాస్ తెచ్చిపెట్టింది. ఆ రోజుల్లోనే ఈ సినిమా రు. 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించి సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్‌ చేసింది. ఆ తర్వాత పోకిరి సినిమా తమిళం, హిందీ, కన్నడ భాషలోకి రీమేక్ చేసి సూపర్ హిట్స్ కొట్టారు.

ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా బిజినెస్‌మెన్. ఈ సినిమా కూడా కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కించుకుంది. ఇక చాలా రోజుల తర్వాత మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 9న బిజినెస్‌మెన్ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అభిమానులతో పాటు సగటు సినీ అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లు 4.20 కోట్ల వసూళ్లను బిజినెస్మేన్ చాలా సింపుల్గా బ్రేక్ చేసింది.

మొదటిరోజు బిజినెస్‌మెన్ ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే లాంగ్ రన్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డులను బ్రేక్ చేయలేకపోయింది. ఖుషి ఫుల్ ర‌న్‌లో ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. బిజినెస్‌మెన్ సినిమాకు కూడా ఈ రికార్డును బద్దలు కొట్టే కెపాసిటీ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈ నెల 11న భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేశారు.

దీంతో ఈ సినిమా కోసం బిజినెస్‌మెన్ ఆడుతున్న థియేటర్లను తొలగించారు. దీంతో మహేష్ బాబుకు ఖుషి రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ మిస్ అయ్యారు. అయితే మొదటి రోజు రీ రికార్డింగ్ మాత్రం భారీ మార్జిన్ తో బిజినెస్‌మెన్ బ్రేక్ చేయడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాను ఈనెల 31న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news