Moviesమ‌హేష్‌బాబు మొబైల్ రింగ్ టోన్ తెలిస్తే నోట మాట రాదు… ఇక...

మ‌హేష్‌బాబు మొబైల్ రింగ్ టోన్ తెలిస్తే నోట మాట రాదు… ఇక అంతా సైలెన్సే…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు జోడిగా కుర్ర క్రేజీ హీరోయిన్లు శ్రీ లీల – మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రముఖ మొబైల్ కంపెనీ బిగ్ సి కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ సి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు హాజరై మీడియా ప్రతినిధులతో సరదాగా ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెపుతూ ఎన్నో వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను కూడా పంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ మీ మొబైల్ రింగ్టోన్ ఏంటి ? అని అడగగా సైలెంట్ అని మహేష్ బాబు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. నా ఫోన్ ఎప్పుడు సైలెంట్ లో ఉంటుంది.. సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటాను కాబట్టి సైలెంట్ లోనే ఉంచుతాను అని మహేష్ బాబు వెల్లడించారు. ఇక గుంటూరు కారం సినిమాపై ఎలాంటి అనుమానాలు వద్దని ముందుగా ప్రకటించినట్టుగానే సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఇక మహేష్ బాబు సమాధానాలు ఎప్పుడు ఊహించ‌ని విధంగా ఉంటాయంటూ నెటిజనులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news