Moviesఅల్లు అర్జున్‌లో అది నాకు బాగా ఇష్టం… చిరు, ప‌వ‌న్‌ను ఘోరంగా...

అల్లు అర్జున్‌లో అది నాకు బాగా ఇష్టం… చిరు, ప‌వ‌న్‌ను ఘోరంగా అవ‌మానించిన శ్రీరెడ్డి..!

తరచూ ఏదో ఒక వివాదంతో ఎవరో ఒకరిపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలవడం శ్రీ రెడ్డికి బాగా అలవాటు అయిపోయింది. మామూలుగా శ్రీరెడ్డిని ఎవరు పట్టించుకోరు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ హాట్ కామెంట్లు చేస్తూ తాను లైన్ లో ఉన్నాన‌ని నిరూపించుకుంటుంది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి ఎప్పుడు మెగా ఫ్యామిలీని.. జనసేన పార్టీతో పాటు, ఆ పార్టీ అభిమానులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది.

అందుకే పవన్ అభిమానులు.. జనసేన అభిమానులు కూడా శ్రీరెడ్డి పై బండబూతులతో విరుచుకుపడుతూ ఉంటారు. తాజాగా అల్లు అర్జున్ జాతి స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో పుష్పరాజ్‌ పాత్రకు గాను అల్లు అర్జున్ కు జాతీయస్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు శ్రీరెడ్డి విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్ చేసింది.

కంగ్రాట్యులేషన్స్ అల్లు అర్జున్ ఆన్ విన్నింగ్ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు.. బన్నీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే మెగా అని ముసుగులో లేకుండా తన పని తాను చేసుకుంటున్నాడు అంటూ శ్రీరెడ్డి కామెంట్ చేసింది. ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మెగా అనే ముసుగు లేకుండా అనే పదం వాడటం ద్వారా శ్రీరెడ్డి మరోసారి మెగాస్టార్ చిరంజీవితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మెగా అభిమానులు గెలికిందని ఒక్కటే కామెంట్లు పడుతున్నాయి. చిరు – పవన్ అభిమానులు మరోసారి శ్రీరెడ్డి పై బూతులతో విరుచుకుపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news