Movies"ఆంధ్రుడు" సినిమా హీరోయిన్ మీకు గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే...

“ఆంధ్రుడు” సినిమా హీరోయిన్ మీకు గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీ కళ్లని మీరే నమ్మలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో సూపర్ స్టార్ హీరోయిన్గా మారి .. ఆ తర్వాత ఫ్లాప్ అయిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు . ఆ లిస్టులోకే వస్తుంది గౌరీ పండిట్ . ఇలా చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేరు . అదే టాలీవుడ్ మ్యాచో హీరోగా పేరు సంపాదించుకున్న గోపీచంద్ కెరియర్ లోనే సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలలో ఒకటి ఆంధ్రుడు సినిమా హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు . పరుచూరి మురళీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది .

సైలెంట్ గా ఈ సినిమా హిట్ అందుకుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో గోపీచంద్ నటన చాలా సైలెంట్ గా అందర్నీ ఆకట్టుకున్నింది. కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా 2005లో విడుదలై ఘనవిజయం సాధించింది . ఈ సినిమాలో హీరోయిన్ పేరే గౌరీ పండిట్ . తన అందంతో అభినయంతో పాటు నటన ప్రతిభతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ న్యూఢిల్లీలో జన్మించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ తో ఇటువైపుగా వచ్చింది .

తెలుగులో మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత కాస్కో ,ఆకాశ రామన్న ,నిత్య పెళ్లి కొడుకు, రాజేంద్ర వంటి సినిమాలలో మెరిసింది. అయితే ఇవేవీ కూడా ఆశించిన స్థాయి హిట్ ఇవ్వలేకపోయాయి. దీంతో కన్నడ – హిందీ భాషలలో అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ అక్కడ కూడా నిరాశ ఎదురయింది . దీంతో 2011లో నటుడు నిర్మాత ఆయన నిఖిల్ దివేదిను ప్రేమించి పెళ్లి చేసుకుంది . కాగా సినిమా ఇండస్ట్రీకి దూరమైన గౌరీ పండిట్ తన ఫిజిక్ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది . అయితే సినిమాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్..మాత్రం లేదంటుంది గౌరీ పండిట్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news