Movies20 ఏళ్ల క్రితం ఒక్క సినిమాతో ఊపేసిన ఈ ముద్దుగుమ్మ తెలుసా…...

20 ఏళ్ల క్రితం ఒక్క సినిమాతో ఊపేసిన ఈ ముద్దుగుమ్మ తెలుసా… !

ఇప్పుడు రెండు దశాబ్దాల క్రితం తొలి సినిమాతోనే సూపర్ పాపులర్ అయిపోయింది ఆ హీరోయిన్. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన అవి అంతగా క్లిక్ కాలేదు. స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావించినా ఆ హీరోయిన్ మిడిల్ రేంజ్ హీరోయిన్ గానే ఉండిపోయింది. తన అందంతోపాటు నటనతో టాలీవుడ్ లో ఎంతోమంది అభిమానులను ఫిదా చేసింది. అప్పట్లో కుర్ర కారును కూడా మెప్పించింది.

ఎంత త్వరగా వెండితెరపై వెలిగిందో అంతే త్వరగా ఆమె ఫేడ‌వుట్‌ అయిపోయింది. ఆమె ఎవరో కాదు రేఖ. ఉషాకిరణ్ మూవీస్ ఆకాష్ హీరోగా నిర్మించిన ఆనందం సినిమాలో రేఖ వేదవ్యాస్‌ హీరోయిన్గా నటించింది. ఆ రోజుల్లోనే ఆనందం 200 రోజులు ఆడింది. ఆ తర్వాత జాబిలి – ఒకటో నెంబర్ కుర్రాడు – జానకి వెడ్స్ శ్రీరామ్ – అనగనగా ఒక కుర్రాడు – దొంగోడు వంటి సినిమాల్లో నటించింది. అయితే స్టార్ హీరోల సినిమాల్లో రేఖకు అవకాశాలు రాలేదు.

తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా జీనియస్. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ అమ్మడు తెలుగుతోపాటు కన్నడ సినిమాలలోను నటించింది. రేఖ స్వతహాగా కన్నడ అమ్మాయి అందుకే తెలుగు కంటే ఆమె కనడ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అదే అందం కొనసాగిస్తున్న చాలా బొద్ధిగా మారింది.

సినిమాలకు దూరమైపోయినా రేఖ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. వ‌రుస‌ ఫోటోషూట్లతో హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పటికీ తనలో అందం చెక్కుచెదరలేదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉంటుంది. అసలు 20 ఏళ్ల క్రితం రేఖను ఇప్పటి రేఖ ఫోటోలు చూస్తే గుర్తుపట్టలేనంతగా ఆమె మారిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news