Moviesవెంకటేష్-రాజమౌళి కాంబోలో రావాల్సిన ఆ మూవీ ఏంటో తెలుసా..? దగ్గుబాటి ఫ్యామిలీ...

వెంకటేష్-రాజమౌళి కాంబోలో రావాల్సిన ఆ మూవీ ఏంటో తెలుసా..? దగ్గుబాటి ఫ్యామిలీ అంతలా బాధపడ్డరా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే . కాగా స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాయి . ఈ క్రమంలోనే దర్శక ధీరుడు – అపజయం ఎరుగని డైరెక్టర్ అంటూ ఆయనకు బిరుదులు ఇచ్చేశారు .

కాగా రీసెంట్గా ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఏకంగా ఇండియన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఆస్కార్ అవార్డు సైతం రావడంతో జనాలు ఫిదా అయిపోయారు . ఈ క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే గ్లోబల్ స్థాయిలో వైరల్ అవుతుంది. ఆయన డైరెక్షన్ లో సినిమా చేయాలి అని చాలామంది హీరోలకు ఉంటుంది . అలా ఆశపడ్డ హీరోలు చాలామంది ఉన్నారు.

అయితే అందరికీ ఆ అదృష్టం దక్కదు. స్వయాన ఓ తెలుగు స్టార్ హీరో రాజమౌళి వద్దకు వచ్చి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తావా అంటూ అడిగారట . ఆ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్ . ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ దగ్గుబాటి వారసుడు ఎలాంటి సినిమాల్లో నటించి ఇండస్ట్రీకి మంచి మంచి హిట్స్ ఇచ్చాడో తెలిసిందే . కాగా వెంకటేష్ ఎప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్టు ” స్వామి వివేకానంద” అంటూ చెప్పుకొస్తూ ఉంటారు .

ఎప్పటికైనా సరే ఆయన తన కెరియర్ లో ఆ బయోపిక్ తెరకెక్కించాలని ఆశపడుతున్నారు . ఈ క్రమంలోనే మగధీర సినిమా టైంలో వెంకటేష్ రాజమౌళితో ఈ సినిమాని డైరెక్ట్ చేస్తావా అంటూ అడిగారట. రాజమౌళి సైతం చేస్తాను అంటూ ప్రామిస్ చేశారట . కానీ ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయిన రాజమౌళి వెంకటేష్ డ్రీమ్ ప్రాజెక్టును అటకెక్కించేశాడు . ఆ టైం లో దగ్గుబాటి కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారట. ఈ ప్రాజెక్టు ఎప్పుడు తెరకెక్కుతుందో అసలు తెరకెక్కుతుందో లేదో కూడా తెలియదు . చూడాలి మరి ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news