Movies"భోళా శంకర్" పబ్లిక్ టాక్ : సినిమా కి వెళ్లే వాళ్లు...

“భోళా శంకర్” పబ్లిక్ టాక్ : సినిమా కి వెళ్లే వాళ్లు ఖచ్చితంగా అది తీసుకెళ్లండి.. మెగాపరువు పాయే..!

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకొని నటించిన సినిమా భోళా శంకర్. వరుస ఫ్లాప్స్ లో సతమతమవుతున్న ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ ను పిలిచి మరి అవకాశం ఇచ్చి ఆయన లైఫ్ సెటిల్ చేయాలని చూసిన మెగాస్టార్ చిరంజీవి కి నిరాశే ఎదురయింది . ఆయన లైఫ్ సెటిల్ చేయడం ఏమో కానీ ఈయన లైఫ్ రిస్క్ జోన్ లో పడిపోయింది అంటున్నారు మెగా అభిమానులు . కొద్దిసేపటి క్రితమే గ్రాండ్ గా థియేటర్ లో రిలీజ్ అయిన భోళా శంకర్ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది .

అందరికి తెలిసిన కథ కావడం.. సీన్స్ లో కూడా ఎక్కడ పెద్దగా ఎలివేషన్స్ చూపించకపోవడంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ కు నమోదు చేసుకుంది . మరీ ముఖ్యంగా గతంలో మెహర్ రమేష్ తెరకెక్కించిన శక్తి-షాడో సినిమాలకు సంబంధించిన సీన్స్ ఈ సినిమాలో ఎక్కువగా రిపీట్ చేయడంతో భోళా శంకర్ కి మరింత నెగటివ్గా మారింది . అంతే కాదు మొదటి నుంచి ఈ సినిమాపై టాక్ ఎక్కడో తేడా కొడుతూనే ఉంది .

చిరు లీక్స్ అంటూ చిరంజీవి ఎంత ట్రై చేసినా కానీ సోషల్ మీడియాలో భోళా శంకర్ కి బజ్ అసలు రాలేదు . అంతేకాదు సినిమాలో హీరోయిన్ తమన్నా పాత్ర కూడా కొంత సేపే ఉండడం తమన్న కంటే కీర్తి సురేష్ ఎక్కువగా చిరంజీవితో ట్రావెల్ కావడం . అయితే ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా కీర్తి సురేష్ జాగ్రత్త పడిన సినిమాలో అసలకి మెయిన్ కావాల్సిన పస లేకపోవడంతో మెగా ఫాన్స్ కూడా హార్ట్ అయ్యారు .

అంతేకాదు నాసిరకమైన డైలాగ్స్ తో సినిమాలో థియేటర్స్ లో ఆ సీన్ ప్లే అవ్వకముందే జనాలు అక్కడ వచ్చే డైలాగ్ ను గెస్ చేసేస్తున్నారు. దీంతో సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది . అంతే కాదు కొంతమంది జనాలు రెచ్చిపోయి మరి మెగాస్టార్ పరువును తీసేస్తున్నారు. సినిమాకి వెళ్లే వాళ్ళు జండూబామ్ తీసుకెళ్లండి అని తలనొప్పులు పక్క అని చెప్పుకొస్తున్నారు. అయితే చిరంజీవి సినిమాకి ఇలాంటి టాక్ రావడం ఇదేమి ఫస్ట్ టైం కాదు గతంలో కూడా పలు సినిమాల్లో వచ్చింది. కానీ ఇంత దారుణమైన టాక్ ఎప్పుడు రాలేదు . సినిమా ఫ్లాప్ అయిన చిరంజీవి నటన తో మెప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . . కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి టోటల్ రివర్స్ అయిపోయింది చిరంజీవి బిస్కెట్ అయిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news