Moviesసమంతకు ఉన్న ఆ బ్యాడ్ అంతా ఖుషి సినిమా పాగోడుతుందా.. విజయ్...

సమంతకు ఉన్న ఆ బ్యాడ్ అంతా ఖుషి సినిమా పాగోడుతుందా.. విజయ్ ఆమెను సేవ్ చేస్తాడా..!

స్టార్ హీరోయిన్ సమంత తన మాజీ భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చాక వరుస‌ పెట్టి సినిమాలు చేస్తోంది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్లో నటించింది. ఆ సాంగ్ సూపర్ హిట్ అయిన సాంగ్లో ఆమె చాలా హార్డ్ గా కనిపించడం ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్ పట్ల తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అక్కినేని అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులు అందరూ సమంతను బాగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆమె యశోద శ‌కుంత‌లం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

యశోద ఒక మోస్త‌రుగా ఆడిన బాక్సాఫీస్ దగ్గర సమంత స్థాయికి తగిన హిట్ ఇవ్వలేకపోయింది. ఇక శకుంతలం సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సమంత కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ రెండు సినిమాలతో సమంతకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. అయితే టాలీవుడ్లో మళ్లీ హీరోయిన్గా రాణించాలని సమంత కలలు కంటోంది. తాజాగా ఆమె విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన ఖుషి సినిమా పైనే ఆమె అసలు అన్ని ఉన్నాయి.

మరి విజయ్ ఆమెకు లక్కీ హీరోగా మారి ఖుషి సినిమాతో హిట్ ఇస్తే సమంత కొన్న‌ల పాటు టాలీవుడ్ లో హీరోయిన్‌గా కంటిన్యూ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఒకవేళ ఖుషి రిజల్ట్ తేడా కొడితే ఇప్పటికే సమంతకు ఉన్న బ్యాడ్ నేమ్ కు తోడు మరింత తోడు అవుతుంది అనటంలో సందేహం లేదు. మరి విజయ్ సమంతను సేవ్ చేసి గట్టి ఎక్కిస్తాడా.. లేదా అన్నది సెప్టెంబర్ 1న తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news