Newsప్రభాస్ తో మంచి ఛాన్స్ ను వదిలేసుకున్న రష్మిక.. వీళ్ళ కాంబోలో...

ప్రభాస్ తో మంచి ఛాన్స్ ను వదిలేసుకున్న రష్మిక.. వీళ్ళ కాంబోలో మిస్ అయిన సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు మిస్ అవుతూ ఉంటాయి. అలా ఒక్కసారి మిస్ అయిన కాంబో మళ్లీ సెట్ అవ్వాలంటే చాలా టైం పడుతూ ఉంటుంది . కొన్నిసార్లు అలాంటి కాంబో అసలు ఇక జీవితంలో సెట్ అవ్వకుండా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే అలా ఎన్నో కాంబోలు మిస్ అయినా వార్తలు మనం విన్నం . కాగా రీసెంట్గా అలా ఒక్క క్రేజీ కాంపౌండ్ మిస్ అయింది అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రెబెల్ హీరో ప్రభాస్ .. ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తున్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బ్యాక్ టు బ్యాక్ వరుసగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ టాప్ పొజిషన్ లో ఉన్న ప్రభాస్ ప్రజెంట్ ప్రాజెక్టుకె విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. కాగా ఇలాంటి హీరోలతో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ వదులుకోదు . కచ్చితంగా సినిమాలో నటిస్తుంది.

కానీ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా మాత్రం ఇతగాడి సినిమాలో చేసే ఛాన్స్ వస్తే మిస్ చేసుకునిందట. ఆ సినిమా కాదు రాధే శ్యామ్ ..ప్రభాస్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మొదట హీరోయిన్గా రష్మిక మందన్నాను అనుకున్నారట మేకర్స్ . అయితే రష్మిక కాల్ షీట్స్ లేవు అనడంతో ఈ ప్రాజెక్టు పూజా హెగ్డే ఖాతాలో పడింది . ఏ మాటక ఆ మాటే రష్మిక కన్నా పూజా హెగ్డే ఈ పాత్రలకు బాగా సూట్ అయింది అన్నారు అభిమానులు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news