Newsపవన్ "బ్రో"ని నమ్మించి ముంచాసాడే.. సినిమా కి బిగ్గెస్ట్ మైనస్ ఇదే..!!

పవన్ “బ్రో”ని నమ్మించి ముంచాసాడే.. సినిమా కి బిగ్గెస్ట్ మైనస్ ఇదే..!!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “బ్రో -ది అవతార్”. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో నటించాడు . మల్టీ స్టారర్ మూవీ గా కొద్ది సేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా. కాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చేసిన.. కామెన్ పీపుల్స్ కి మాత్రం ఈ సినిమా యావరేజ్ గా అనిపిస్తుంది.

సినిమాలో పెద్దగా కంటెంట్ ఏమీ లేకపోవడం ..పాత చింతకాయ పచ్చడి లాగే ఉండడం.. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చేలా చేసింది . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే కొన్ని మినిమం క్వాలిటీలు ఎక్స్పెక్ట్ చేస్తారు అభిమానులు . అయితే పవన్ కళ్యాణ్ నీ పూర్తిగా ఆ స్థాయిలో చూపించడంలో ఫెయిల్ అయ్యాడు సముద్రఖని అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. అంతేకాదు సినిమా మొత్తానికి చూసుకుంటే సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ కన్నా పవన్ క్యారెక్టర్ నిన్ హైలెట్ చేయడానికి చూసాడు సముద్రఖని.

కానీ పవన్ కళ్యాణ్ స్టైల్ ని ఎక్కడ వాడుకోలేకపోయాడు. సినిమా పెద్దగా ఎంటర్టైన్మెంట్గా లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. అడపాదడపా నాటీ నాటీ డైలాగ్స్ తో నెట్టుకొచ్చాడే కానీ..ఎక్కడ సినిమాకి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ విధంగా టాక్ అందుకోలేక పోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . సినిమాలో పవన్ కళ్యాణ్ జాన్ జిగిడి దోస్త్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మ్యాజిక్ మిసైందని చెప్పుకొస్తున్నారు. అంతా వేరే సినిమాలోని డైలాగ్స్ లానే ఉన్నాయి కానీ.. ఎక్కడ సో స్పెషల్..వావ్ అనే రేంజ్ డైలాగ్స్ లేవు. ఇదే ఈ సినిమాకి మెయిన్ మైనస్ అయ్యింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే పిచ్చిపిచ్చిగా నచ్చేసిన ఈ సినిమా మిగతా ఫాన్స్ కు ఒక్కసారి చూస్తే హ్యాపీ రెండోసారి చూస్తే తలనొప్పి లా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఫైనల్లీ పవన్ కళ్యాణ్ భారీ అంచనాలు పెట్టుకొని నటించిన ఈ సినిమా యావరేజ్ గా టాక్నమోదు చేసుకొన్నింది. చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news