Newsమరికొద్ది గంటల్లో "బ్రో" సినిమా రిలీజ్.. ఫ్యాన్స్ కు సాయి ధరమ్...

మరికొద్ది గంటల్లో “బ్రో” సినిమా రిలీజ్.. ఫ్యాన్స్ కు సాయి ధరమ్ తేజ్ బ్యాడ్ న్యూస్(వీడియో)..!!

ప్రజెంట్ మెగా అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా “బ్రో -ది అవతార్” . టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమానే ఇది . ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ మరో పాత్ర లో నటించబోతున్నాడు . ఈ సినిమాలో రియల్ హీరో ఎవరు అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమవుతుంది . కాగ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అతిథి పాత్ర కంటే ఎక్కువగా .. హీరో కంటే తక్కువ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

ఈ సినిమాను తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశారు డైరెక్టర్ సముద్రఖని. 2021 డిసెంబర్ లో విడుదలైన సినిమా “వినోదయ సీతం” సినిమాకి ఈ సినిమా డబ్బింగ్ గా తెరకెక్కింది. సముద్రఖని నటించిన ఈ సినిమాకి దర్శకత్వం ఆయనే వహించారు. ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది . 99 నిమిషాల నిడివి గల ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు తెలుగులో డబ్ చేస్తూ కొంచెం నిడివి పెంచుతూ అక్కడక్కడ మార్పులు చేశాడు సముద్రఖని.

కాగా మరి కొద్ది గంటలోనే ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇలాంటి టైం లోనే సినిమా ప్రమోషన్స్ అంతంత మాత్రమే ఉన్నాయి అన్న టాక్ వినిపించడంతో మేకర్స్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సాంగ్ రిలీజ్ చేశారు . పవన్ కళ్యాణ్ పాత పాటని మరోసారి రీ క్రియేట్ చేసి 42 సెకండ్లు ఉన్న వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా సినిమాపై కూసింత హైప్ క్రియేట్ అయింది .

అయితే ఈ పాట నిజంగానే సినిమాలో ఉందనుకుంటున్నారు పవన్ అభిమానులు . అయితే అలాంటిది లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్ . రీసెంట్గా ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ ఆ పాట కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే..అని అది తెర పై చూడటం చాలా కష్టమని ..అంతగా చూడాలంటే యూట్యూబ్ లోనే చూసి సరి పెట్టుకోవాలని క్లారిటీ ఇచ్చాడు . దీంతో పవన్ ఫ్యాన్స్ కూసింత డిసపాయింట్ అయ్యారు. చూడాలి మరి బ్రో సినిమా ఎలా ఉండబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news