Moviesరూటు మార్చిన పూజా హెగ్డే.. సినిమాలు పోతే ఏం..నెల తిరిగేసరికి కోట్లు...

రూటు మార్చిన పూజా హెగ్డే.. సినిమాలు పోతే ఏం..నెల తిరిగేసరికి కోట్లు అకౌంట్ లో పడిపోతున్నాయే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ పూజ హెగ్డే స్థానం ఎంత దారుణంగా పడిపోయిందో మనకు బాగా తెలిసిన విషయమే. కాదు వరుసగా బ్యాక్ టు బ్యాక్ నలుగురు స్టార్ హీరోలతో నాలుగు బడా డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే ఖాతాలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా లేదు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో నటిస్తుంది అన్న ఆశలైనా ఉండేటివి . అయితే అది కూడా చేజారిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా నుంచి పూజ హెగ్డే తప్పుకుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది .

ఈ క్రమంలోనే పూజ అటు బాలీవుడ్ కి ఇటు టాలీవుడ్ కి కాకుండా మిడిల్ లో నలిగిపోతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అయితే పూజా హెగ్డే మాత్రం డబ్బుల విషయంలో ఏ మాత్రం బాధపడడం లేదట . ఎందుకంటే ఆమె హీరోయిన్గా అవకాశాలు రాకపోయినా నెల తిరిగేసరికి కోట్లు తన అకౌంట్ ఖాతాలో పడిపోతున్నాయట . సినిమా ఇండస్ట్రీలో కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే పూజ పలు బిజినెస్ లో పెట్టుబడులు పెట్టిందని.. తనకు సినిమాలు ఉన్నా లేకపోయినా ఆ డబ్బులు నెలకి అకౌంట్లో చేరిపోతాయని .. ఆ రకంగా పూజాతన సంపాదన ముందుకు తీసుకెళుతుందని తెలుస్తుంది.

ఇప్పుడు మరింత స్థాయిలో బిజినెస్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటుందని .. తద్వారా మరింతగా తాను డబ్బులు సంపాదించే విధంగా పూజా హెగ్డే తన మైండ్ ని మార్చేసుకుంటుంది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఇండస్ట్రీలో ఉండే పలువురు హీరోలు కూడా బిజినెస్ లో పెట్టుబడులు పెడుతున్నారు . వాళ్ళ సహాయం తీసుకుంటూ పూజ బిజినెస్ల్లో టాప్ పొజిషన్ కి వెళ్ళాలి అంటూ ఆశపడుతుందట . సినిమా ఇండస్ట్రీ అన్నాక ఒడిదుడుకులు కామన్.. హిట్స్ ఫ్లాప్స్ సాధారణంగా అందరికీ ఉంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి ఎప్పుడు చేజారి పోతుందో తెలియక పూజ ముందుగానే ముందు చూపుతో ఇలా డబ్బులు సేవ్ చేసుకుందని ..సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో పూజ హెగ్డే పేరు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news