Movies"వరుణ్ తేజ్ లాగే హీరోయిన్ తో పెళ్లి".. మ్యారేజ్ పై క్రేజీ...

“వరుణ్ తేజ్ లాగే హీరోయిన్ తో పెళ్లి”.. మ్యారేజ్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..!!

సినిమా ఇండస్ట్రీలో పెళ్లికాని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎంతోమంది ఉన్నారు . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ టక్కున గుర్తువచ్చేది ఆరడుగుల అందగాడు హీరో ప్రభాస్ . ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయింది.. త్వరలోనే ఆ వయసు దాటిపోతుంది.. అసలు ఈ హీరో పెళ్లి చేసుకుంటాడా..? చేసుకోడా..? చేసుకుంటే ఏ హీరోయిన్ చేసుకుంటారు..? లేదా ముందు నుంచి ప్రచారం జరుగుతున్న అనుష్క శెట్టి నే చేసుకుంటారా ..? ఒకవేళ చేసుకుంటే మీడియాకి ఎలాంటి సమాధానం ఇస్తాడు ..? ఇలాంటి బొచ్చ బోలెడు ప్రశ్నలు సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి .

అయితే వీటికి కాంపిటీషన్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ పెళ్లి విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే రీసెంట్గా సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ జరిగింది . చావు అంచుల వరకు వెళ్లి మళ్లీ బ్రతికి పునర్జన్మను అందుకున్నాడు. అయితే యాక్సిడెంట్ తర్వాత తేజు చాలా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు పర్సనల్ లైఫ్ లో చాలా ఓపికగా నిర్ణయం తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో కలిసి “బ్రో” అనే సినిమాలో నటిస్తున్నారు .

ఈ సినిమా ఈనెల 28న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయిధరమ్ తేజ్ .. పలు ఇంటర్వ్యూ లకి అటెండ్ అవుతున్నారు . కాగ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ ఈవెంట్ లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ తన పెళ్లి పై స్పందించారు . తిరుపతిలో జరిగిన సెకండ్ సింగిల్ లాంచ్ కార్యక్రమంలో సాయిధర్మతేజ్ మాట్లాడుతూ ..”ఇంకెక్కడి పెళ్లి బ్రో ఈ సినిమాకు ముందు ఎవరో ఒకరు ట్రై చేసేవారు ..అయితే ఇప్పుడు అందరూ నన్ను బ్రో అనే పిలుస్తున్నారు ..ఏంటో ఇది ..ఇక నా పెళ్లి అయినట్లే ” అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. దీంతో అక్కడ ఉండే జనాలు పకపక నవ్వేసుకున్నారు . అయితే సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ పెళ్లిపై మాత్రం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడని వరుణ్ తేజ్ లాగే చెప్పకుండా ఏదో ఒక రోజు నిశ్చితార్థం చేసుకొని అభిమానుల కి షాక్ ఇస్తాడని కామెంట్స్ చేస్తున్నారు . చూద్దాం మరి ఆ న్యూస్ ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news