Moviesహన్సిక జగత్ కంత్రీ..స్టేజీ పై అసలు గుట్టు రట్టు చేసిన రోబో...

హన్సిక జగత్ కంత్రీ..స్టేజీ పై అసలు గుట్టు రట్టు చేసిన రోబో శంకర్..!!

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీస్ కూడా స్టేజిపై పర్ఫామెన్స్ లో ఇరగదీస్తున్నారు . ఎంతలా అంటే అంతా మాట్లాడేసి తిట్టాల్సిన ..నాలుగు మాటలు తిట్టేసి .. ఆ తర్వాత సారీ అంటూ చేతులు దులిపేసుకుంటున్నారు . ఇప్పటికే చాలామంది స్టార్ ప్రముఖులు ఇలానే చేశారు . కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హన్సిక .. తాజాగా నటిస్తున్న సినిమా పార్ట్నర్ . ఈ సినిమాలో ఆది హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో రోబో శంకర్ కూడా ఓ కీలక పాత్రలో మెరిశారు.

పాట్నర్ ట్రైలర్ విడుదల సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన వేదికపై హన్సిక కూర్చొని ఉండగానే ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేశారు . ఈ క్రమంలోనే హన్సిక కూసింత అసహనం వ్యక్తం చేసింది. దర్శకుడు ఎంత చెప్పినా కూడా హన్సిక తన కాలు తాకను అని మొండి చేశారని ..ఆమె నన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అంటూ హన్సిక పై సంచలన కామెంట్స్ చేశారు .

అంతే కాదు హన్సిక తీరుకు దర్శకుడు తో పాటు సెట్లో ఉన్న వాళ్లంతా కూడా ఆశ్చర్యపోయారని.. రోబో శంకర్ చెప్పుకొచ్చారు . అయితే ఈ కామెంట్స్ చేసినప్పుడు హన్సిక పక్కనే ఉండడం గమనార్హం . దీంతో ఆమె అసహనం వ్యక్తం చేసింది . ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి . దీంతో సోషల్ మీడియాలో రోబో శంకర్ హన్సికపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . అయితే రోబో శంకర్ కు అనారోగ్యం కారణంగా ఇలా మాట్లాడాడు అంటూ పలువురు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే హన్సిక ఈ వ్యాఖ్యలపై ఘాటైన జవాబు ఇవ్వకపోతే తప్పంతా ఆమెదే అనుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news