Newsఆస్కార్‌ ముందు రోజు రాత్రి ఏం జరిగింది..? రాజమౌళి అంత...

ఆస్కార్‌ ముందు రోజు రాత్రి ఏం జరిగింది..? రాజమౌళి అంత మాట అన్నాడా..? చరణ్-తారక్ అంతలా బాధపడ్డారా..?

వామ్మో.. రాజమౌళి ఇంత స్టిక్ట్ గా ఉంటారా .. తెరపై చాలా ఫన్నీ ఫన్నీగా జోక్స్ వేస్తూ సరదాగా కనిపించే రాజమౌళి తెర వెనక మాత్రం ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉంటారా ..?అంటే అవునని అంటున్నారు సినీ స్టార్స్ . రీసెంట్గా రాజమౌళికి సంబంధించిన టాప్ సీక్రెట్ ని బయట పెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . మనకు తెలిసిందే రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలయికలో రీసెంట్గా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ వరకు నామినేట్ అయి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చి ఇండియన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న కోరికను తీర్చేసింది,

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే ఫస్ట్ టైం ఇండియన్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకుంది . అయితే ఆస్కార్ అందుకోవడానికి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ ఆస్కార్ అందుకోవడానికి వెళ్లే ముందు రోజు రాత్రి మాత్రం రాజమౌళి చరణ్ కి ఎన్టీఆర్ కి చుక్కలు చూపించేసాడట జక్కన. ఎక్కడ ఒక మాట మాట్లాడుకోనీకుండా.. సరదాగా కబుర్లు చెప్పుకోకుండా వెనకే ఉంటూ టార్చర్ చేసేసారట . ఇంకా పక్కాగా చెప్పాలంటే కూసింత గట్టిగానే క్లాస్ పీకాడట .

ఆ విషయాన్ని రామ్ చరణ్ రీసెంట్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు . రాజమౌళి చెప్పిన మాటలను అదే విధంగా చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ . ఆయన ఏమన్నారంటే . “ఇదేమి సౌత్ ఇండియా మీడియా లేదా బాలీవుడ్ మీడియా కాదు ..త్వరగా పడుకోండి .. ఉదయం ఏడు గంటల కల్ల నిద్రలేచేసి అక్కడ ఉండాలి ..ఏ కొంచెం మనం దొరికినా సరే మీరేమన్న హాలీవుడ్ సూపర్ స్టార్స్ నా..?అంటూ ఏకీపారేస్తారు . అలాంటివి నేను వినకూడదు అనుకుంటున్నాను . కాబట్టి త్వరగా పడుకోండి త్వరగా నిద్ర లేవండి.. టైంకి అక్కడ ఉండాలి” అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట . దీంతో రాంచరణ్ -తారక్ ..జక్కన్న టైం సెన్స్ ని ఆయన చెప్పిన మాటలను గుర్తు పెట్టుకొని మరి ఉదయం ఏడుకు లేచి రెడీ అయిపోయారట . ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూ రాంచరణ్ బయట పెట్టాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news