Movies"ఊ అంటావా మావ" పాటలో సమంత కన్నా ముందు అనుకున్న...

“ఊ అంటావా మావ” పాటలో సమంత కన్నా ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? సుక్కు మాములోడు కాదుగా..!!

సినిమా ఇండస్ట్రీలో సినిమా హిట్ అయితే ఒక నెల రోజులు.. ఆరు నెలలు గుర్తు పెట్టుకుంటారు . అదే ఓ పాట హిట్ అయితే మాత్రం కొన్ని దశాబ్దాలు గుర్తుపెట్టుకుంటారు. అలాంటి ఓ పాట పుష్ప సినిమాలో దేవిశ్రీప్రసాద్ తనదైన స్టైల్ లో కంపోజ్ చేశాడు . చంద్రబోస్ ఎంత రియలిస్టిక్ గా లిరిక్స్ రాశారో మనకు తెలిసిందే. కాగా ఈ సినిమాకి ఈపాటే హైలైట్ గా మారింది . ఈ పాటలో సమంత ఎంత హాట్ గా కనిపించిందో మనకు తెలిసిందే.

సమంత కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ పాట రికార్డులు నెలకొల్పింది. అంతేకాదు సినిమా రిలీజ్ అయి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికి ఈ పాట ట్రెండింగ్ లోనే ఉంది అంటే ఈ పాట ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు . అయితే సుకుమార్ ఈ పాటకు ఫస్ట్ హీరోయిన్గా చూస్ చేసుకునేది సమంతను కాదట. హీరోయిన్ తమన్నా అంటూ తెలుస్తుంది .

సుకుమార్ స్టార్ హీరోయిన్స్ ని తన సినిమాలో ఐటమ్ గర్ల్ గా చూపించే సాహసం చేస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే తమన్నా ని అప్రోచ్ అవ్వగా.. వేరే ప్రాజెక్ట్ లో బిజీగా ఉండడంతో నో చెప్పిందట. ఆ తర్వాత ఏ హీరోయిన్ బాగుంటుందా అంటూ ఆరా తీయగా అల్లు అర్జున్ సమంత పేరును చూస్ చేశారట . అప్పుడే విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత ఈ పాటకు ఒప్పుకుంటుందా..? లేదా ..?అంటుంటే అల్లు అర్జున్ ఫోన్ చేసి మరీ ఒప్పించారట . ఆ తర్వాత ఈ పాత్ర ఎంత హైలైట్ గా మారిందో మనకు తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news