Moviesరామ్ చరణ్ - ఉపాసన పెంచుకునే.. ఈ పెట్ డాగ్ ధర...

రామ్ చరణ్ – ఉపాసన పెంచుకునే.. ఈ పెట్ డాగ్ ధర ఎంతో తెలిస్తే కళ్ళు జిగేల్ అనాల్సిందే..!!

ఈ మధ్యకాలంలో మనుషుల్లో మానవత్వం పెరిగిపోయింది . అందుకే మూగజీవులపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు . కాగా కొంతమంది జనాలు నిజంగానే మూగజీవులంటే ఇష్టపడి పెంచుకుంటుంటే ..మరి కొంతమంది జనాలు మాత్రం సింప్లిసిటీ కోసం .. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం మేం అనిమల్ లవర్స్ అంటూ చెప్పుకోవడం కోసం పెట్స్ ని పెంచుకుంటున్నారు . అయితే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువ హీరోయిన్స్ పెట్స్ ని పెంచుకోవడం ఇప్పటివరకు చూసాం .

సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మేల్ సెలబ్రిటీల వద్ద ఈ పెట్స్ ఉంటాయి . వాళ్లలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు రాంచరణ్ . మొదటి నుంచి చరణ్ కి పెట్స్ అంటే పెద్దగా ఇష్టం లేదట . ఉపాసనతో ఫ్రెండ్షిప్ మొదలైనప్పటి నుంచి పెట్స్ పై ప్రేమ పెంచుకోవడం స్టార్ట్ చేశారట . ఉపాసన ఎంత జంతు ప్రేమికురాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మూగజీవులు అంటే ఉపాసన ప్రాణం ఇచేస్తుంది. కాగా ఉపాసన – రాంచరణ్ కుక్కను పెంచుకుంటున్న విషయం తెలిసిందే .

ఎక్కడికి వెళ్తున్నా సరే ఆ కుక్కని వెంటపెట్టుకొని వెళ్తారు . ఆస్కార్ అవార్డుకి వెళ్లిన.. టూర్లకి వెళ్లిన.. హనీమూన్ కి వెళ్ళిన కచ్చితంగా ఆ పెట్ ఉండాల్సిందే . ఆ కుక్క పేరు రైమ్ . చూడడానికి ఒక బొమ్మలా.. చాలా ముద్దుగా క్యూట్ గా ఉంటుంది . చూడగానే అట్రాక్ట్ అయిపోతా ఉంటారు జనాలు . అయితే రైమ్ ని ఎక్కడికి వెళ్లినా కూడా వెంటబెట్టుకొని తీసుకెళ్లడానికి మెయిన్ రీజన్ రాంచరణ్ – ఉపాసన తమ లైఫ్ లో ఆ డాగ్ ను చాలా ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారట .

ఆఖరికి కూతురు పుట్టిన సరే కూతురుతో సమానంగా కుక్కను పక్కన పెట్టుకొని ఫొటోస్ తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేశారు ..అంటే ఆ కుక్క ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోవచ్చు . అయితే ఆ కుక్క ధర తెలిసి సోషల్ మీడియాలో జనాలు షాక్ అయిపోతున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఆ కుక్క ధర 200 డాలర్లు అంటూ తెలుస్తుంది . మన భారతదేశ కరెన్సీ ప్రకారం 1,70,000 కు పైగానే ఉంటున్నట్లు తెలుస్తుంది . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news