Moviesటైం చూసి కొట్టిన హైపర్ ఆది.. ఈ మెగా డైరెక్టర్ ముఖం...

టైం చూసి కొట్టిన హైపర్ ఆది.. ఈ మెగా డైరెక్టర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా భోళా శంకర్ . ఈ సినిమాని డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు . అయితే మెహర్ రమేష్ అనగానే అందరికీ షాడో – శక్తి సినిమాలే గుర్తొస్తాయి. బిగ్ స్టార్స్ జీవితాన్ని సర్వనాశనం చేశాడు అంటూ అప్పట్లో ట్రోలింగ్ కూడా జరిగింది . అయితే అదే విషయాలను తెరపైకి మరోసారి తీసుకొచ్చాడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది . భోళా శంకర్ సినిమాలోని జామ్ జామ్ జామ్ జజ్జనక సాంగ్ రిలీజ్ ఈవెంట్లో భాగంగా హైపర్ ఆది స్టేజిపై మాట్లాడుతూ మెహర్ రమేష్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు .

ఆయన మాట్లాడుతూ ..”మెహర్ రమేష్ అనగానే అందరికీ శక్తి-షాడో గుర్తొస్తాయని ..అయితే ఇండియన్ సినిమాకి పేరు తెచ్చిన బాహుబలి ప్రభాస్ కెరియర్ లోని స్టైలిష్ సినిమా ఏది అంటే అందరికీ గుర్తొచ్చేది బిల్లా అని.. ఆ సినిమాను తెరకెక్కించింది ఈయననే అని చెప్పుకొచ్చారు . అంతేకాదు ఫెయిల్యూర్స్ వల్లే ఆయనను ట్రోల్ చేయాల్సి ..వస్తే ప్రతి ఒక్క మనిషిని ట్రోల్ చేయాలి ..లైఫ్ లో ఫెయిల్ అవ్వని వ్యక్తి అంటూ ఎవ్వరు ఉండరు.. ఇలా ఆయన ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఒకప్పుడు ఫెయిల్ అయిన మనుషులే అని గుర్తుంచుకోవాలి”.

“అంతేకాదు మనం ఇప్పటికీ ఫుడ్ తింటున్న టైం లో వెంకీ – దుబాయ్ శీను -ఢీ లాంటి చిత్రాల కామెడీని పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం . ఆ సినిమాలను తెరకెక్కించింది శ్రీను వైట్ల ..ఇప్పుడు శ్రీను వైట్ల గారు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అలా అని ఇండస్ట్రీలో ఆయన తీసిన సినిమాలను జనాలు చూడకుండా ఉన్నారా ..? కాదు కదా.. ప్రతి మనిషికి ఒక టైం రావాలి ..మెహర్ రమేష్ ఇప్పుడు వస్తుంది . శక్తి షాడో ట్రోల్లింగ్స్ అన్ని ఈ సినిమాకి ఆశీర్వాదాలుగా మారుతాయి. ఈ సినిమాలో చిరంజీవి గారి నటన అదిరిపోతుంది” అంటూ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు .

అయితే ప్రశాంతంగా జరుగుతున్న సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హైపర్ ఆది ఇలా మెహర్ రమేష్ గత తాలుక జ్ఞాపకాలని తవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత రేంజ్ లో ట్రోలింగ్కి గురిచేస్తుంది . ఆయన ఆ విషయాలు మర్చిపోతున్న క్రమంలో మళ్లీ నువ్వు పుండు మీద కారం లా రెచ్చగొట్టావే హైపర్ ఆది అన్న అంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news