Moviesఆ స్టార్ హీరో కోసం దీపికా పదుకొనే షాకింగ్ నిర్ణయం..ఏ హీరోయిన్...

ఆ స్టార్ హీరో కోసం దీపికా పదుకొనే షాకింగ్ నిర్ణయం..ఏ హీరోయిన్ చేయకూడని పని ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది . ఒక అప్పట్లో లా పాత చింతకాయ పచ్చడి లాగానే హీరో అంటే హీరో రోల్స్ నే చేయాలి.. హీరోయిన్ అంటే హీరోయిన్ రోల్స్ నే చేయాలి అంటూ ఎవరు గిరి గిసి పెట్టుకోవడం లేదు. ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోతూ వస్తుంది . ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు . ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే విలన్ పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . మరీ ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మలు ఐటం గర్ల్ పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించి మరీ ముందడుగు వేస్తున్నారు .

ఈ క్రమంలోనే మరి కొంతమంది ముద్దుగుమ్మలు తమలోని నెగిటివ్ షెడ్ ని బయట పెడుతూ విలన్ గా కూడా చేస్తున్నారు. ఏ చిన్నాచితక హీరోయిన్ అలా చేస్తే పర్లేదు ఇండస్ట్రీలో ఎన్నో అవార్డ్స్ తీసుకొని గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మలు కూడా ఇలా విలన్ గా చేయడానికి ఇష్టపడుతున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది దీపికా పదుకొనే .

ఎస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం త్వరలోనే దీపికా పదుకొనే ఓ స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటించబోతుంది అంటూ తెలుస్తుంది . ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూర్య . ఇప్పటికే జై భీమ్, ఆకాశమే నీ హద్దురా, విక్రమ్ లాంటి సినిమాల తో దూసుకుపోతున్న సూర్య ప్రెసెంట్ అత్యంత క్రేజీ హీరోగా మారారు . టాప్ హీరోల లో వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా మారిపోయారు .

ఈ నేపథ్యంలోనే రీసెంట్గా ఆయన నుంచి కంగువా అనే సినిమాను చేయబోతున్నారని అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు . పిరియాడికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ 14వ సెంచరీ నేపథ్యంలో సాగుతుందట . ఇందులో సూర్య అడవి జాతి ప్రజల నాయకుడిగా కనిపిస్తాడు అంటూ తెలుస్తుంది . ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . అయితే ఈ సినిమాలో విలన్ రోల్ లో దీపిక పదుకొనే నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. దీనితో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news