Moviesఛార్మీ ద‌గ్గ‌ర స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు ఘోర అవ‌మానం… అంత చీఫ్‌గా...

ఛార్మీ ద‌గ్గ‌ర స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు ఘోర అవ‌మానం… అంత చీఫ్‌గా చూశారా…!

మణిశర్మ.. సీనియర్ సంగీత దర్శకుడు. అద్భుతమైన కెరీర్ చూసిన టెక్నీషియ‌న్‌. మ‌ధ్య‌లో డౌన్ అయినా కూడా ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఇస్మార్ట్‌శంక‌ర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఆ సినిమా విజ‌యంలో మ‌ణి మ్యూజిక్ కూడా చాలా హెల్ఫ్ అయ్యింది. ఇక ఇప్పుడు అదే పూరి-అదే రామ్ కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా స్టార్ట్ మొద‌లైంది.

అయితే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మ‌ణిశ‌ర్మ పేరు ఇంకా ఫిక్స్ కాలేదు. మ్యూజిక్ డైరక్టర్ డిస్కషన్లు న‌డుస్తున్నాయి. అయితే ఈ విష‌యంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది. మ‌ణిశ‌ర్మ‌ను ఈ సినిమా కోసం పిలిచార‌ట‌. మ‌ణి రు. 2 కోట్లు అడిగాడ‌ట‌. అమ్మో.. అంత ఇవ్వలేమని ఛార్మి-పూరి ఇద్ద‌రూ అనేసిన‌ట్టుగా టాక్ ?

ఇక పూరి సినిమాల‌ను అన్నీ తానై ప‌ర్య‌వేక్షించే ఛార్మీ అయితే రు. 2 కోట్లు చాలా ఎక్కువే అని మ‌ణిశ‌ర్మ మొఖం మీదే చెప్పిసింద‌న్న గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి. నిజంగా మ‌ణిశ‌ర్మ రేంజ్‌కు ఈ రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డం న్యాయ‌మే. అయితే మ‌ణి కూడా ఈ అమౌంట్ అంతా తాను ఎక్క‌డ తీసుకుపోతాను.. సినిమా క్వాలిటీకే క‌దా ఖ‌ర్చు పెట్టేద‌ని స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోయిన‌ట్టు స‌మాచారం.

అయితే పూరి, ఛార్మీ మాత్రం మ‌ణిశ‌ర్మ‌కు కం బ్యాక్ ఫిల్మ్‌గా ఇస్మార్ట్ శంక‌ర్ ఛాన్స్ పిలిచి తామే క‌దా అవ‌కాశం ఇచ్చింది.. ఇప్పుడు త‌మ సినిమాకే అంత అడిగితే ఎలా ? అని అడుగుతున్నార‌ట‌. అయితే భీమ్స్‌ను తీసుకోవాలంటున్నారు. అత‌డి రెమ్యున‌రేష‌న్ కూడా రు. 2 కోట్లు ద‌గ్గ‌ర ఉండ‌డంతో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news