MoviesTL రివ్యూ: హిడింబ‌… వాళ్ల‌కు మాత్రం ఓకే

TL రివ్యూ: హిడింబ‌… వాళ్ల‌కు మాత్రం ఓకే

టైటిల్‌: హిడింబ‌
స‌మ‌ర్ప‌ణ‌: అనిల్ సుంక‌ర‌
న‌టీన‌టులు: అశ్విన్‌బాబు, నందితాశ్వేత‌, శ్రీనివాస్ రెడ్డి, సుభ‌లేఖ సుధాక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, విద్యుల్లేఖ రామ‌న్‌, ప్ర‌మోదిని, ర‌ఘు కుంచె, దీప్తి న‌ల్ల‌మోతు త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: బి. రాజ‌శేఖ‌ర్‌
మ్యూజిక్‌: వికాస్ బాడిస‌
నిర్మాత‌: గంగ‌ప‌ట్నం శ్రీథ‌ర్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనిల్ క‌న్నెగంటి
రిలీజ్ డేట్‌: 20 జూలై, 2023

ప‌రిచ‌యం:
ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం దాదాపు ఆరేడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్యూ కట్టాయి. వాటిలో హిడింబ‌ సినిమా ఒకటి. ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి నిర్మించిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్లు ఆసక్తి రేకెత్తించే ఉండడంతో పాటు అగ్రనిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను సమర్పిస్తుండడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఒకరోజు ముందుగానే ప్రీమియర్లు వేయడంతో పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

క‌థ‌:
అభయ్ ( అశ్విన్ బాబు ) ఆద్య ( నందిత శ్వేత) పోలీసు శిక్షణలో ఉండగా ప్రేమలో పడతారు. అయితే కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ హైదరాబాద్లో పోలీసు అధికారిగా పనిచేస్తూ ఉంటాడు. కాలక్రమంలో వీళ్ళిద్దరూ ఒక కేసు విషయంలో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాప్లకు సంబంధించి విచారణ చేసే క్రమంలో మీరు బోయ‌ అనే కరుడుగట్టిన ముఠాను పట్టుకుంటారు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలు అందరినీ విడిపిస్తారు.

ఈ కేసు ముగిసింది అనుకుంటున్న‌ టైం లో నగరంలో సడన్గా మరో అమ్మాయి కిడ్నాప్ అవ్వడంతో కేసు మళ్లీ మొదటికి వస్తుంది. అసలు బోయ పోలీస్ కస్టడీలో ఉండగా ఈ కిడ్నాప్ ఎలా ? జరిగింది అని ఆలోచిస్తోన చేస్తున్న క్రమంలో అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతడి చర నుంచి విడిపించిన అమ్మాయిలు వేరని తెలుస్తుంది. ఆ సమయంలో ఒక నేరస్థుడు రెడ్ డ్రస్ వేసుకున్న అమ్మాయిలని టార్గెట్ గా చేసుకుంటున్నట్టు ఆద్య‌ కనిపెడుతుంది.

దీంతో అతడిని పట్టుకునేందుకు చేపట్టిన ఒక సీక్రెట్ ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. ఇలాంటి సమయంలో డిపార్ట్మెంట్ కు చెందిన ఒక అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. ఈ కేసును ఆధ్యా, అభయ్ ఎలా చేధించారు. అసలు ఈ కిడ్నాప్ వెనుక ఉన్న నేరస్తుడు ఎవరు ? ఈ కథకు అండమాన్ దీవుల్లో ఉన్న ఆదిమ తెగ‌కు ఉన్న సంబంధం ఏంటి ? ఆధ్యా, అభయ్ ప్రేమ గెలిచిందా లేదా అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేష‌ణ :
ఈ కథను దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతూ ఉంటుంది. ప్రేక్షకులను థ్రిల్‌ చేసేందుకు దర్శకుడు మంచి కథను ఎంచుకున్నాడు. అయితే ఇలాంటి కథను ప్రేక్షకులకు చెప్పేటప్పుడు గందరగోళం ఉండకూడదు.. కానీ ఎడిటర్ తప్పిదమో లేదా దర్శకుడు టేకింగ్ లోప‌మో తెలియదు గాని ఈ సినిమా విషయంలో ఆ పొరపాటు స్పష్టంగా కనపడింది. టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పుడే దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

నగరంలో అమ్మాయిలు వరుసగా కిడ్నాప్ అవ్వటం.. ఆ కేసును చేధించేందుకు హీరోయిన్ రంగంలోకి దిగటం.. ఇలా చకచ కథ‌ పరుగులు తీస్తుంది. అయితే కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారిగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మారిపోతుంది. అసలు పెద్దగా ట్విస్టులు లేకుండానే ట్విస్టులు తెలిసిపోతూ ఉంటాయి. ఇది ప్రేక్షకులకు ఏమాత్రం రుచించదు. అయితే కాలా బండ ముఠా నేపథ్యంలో అల్లుకున్న సీన్లు మాత్రం ఆసక్తిగా ఉంటాయి. బోయ గ్యాంగ్‌కు హీరో అశ్విన్‌కు మధ్య వచ్చే ఫైట్ ఆసక్తిగా ఉంటుంది.

ఇక అసలు నేరస్తుడిని పట్టుకునేందుకు ఆపరేషన్ రెడ్ ఎపిసోడ్ మరి సాగదీసినట్టుగా ఉంది. ఇక సెకండాఫ్ లో వచ్చే కిడ్నాప్లు, అండమాన్ దీవుల్లో ఆదిమ జాతికి ముడిపెట్టిన తీరు బాగుంది. ఆదిమ జాతికి సంబంధించిన ఎపిసోడ్ మొత్తం త్రిల్లింగ్‌గానే ఉంది. అలాగే కేరళ నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ కూడా పరవాలేదు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం షాకింగ్ సర్ప్రైజ్. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ఊహలకు అందని విధంగా ఉన్నా క్లైమాక్స్ అంత సంతృప్తిగా అనిపించదు.

నటీనటుల పరంగా చూస్తే హీరో అశ్విన్ ను మరో మెట్టి పైకి ఎక్కించే సినిమా ఇది. ఈ సినిమా కోసం అశ్విన్ మేకవర్ అయిన తీరు ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లోను ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. క్లైమాక్స్‌లో అయితే అశ్విన్‌తో పోటీపడి మరి నటించింది. మకరంద దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఆ పాత్రను దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. మిగిలిన నటీనటుల పాత్రలు తమ పరిధి మేరకు ఉంటాయి.

దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం ఉన్నా దాన్ని అధ్యంతం అంతే ఆసక్తిగా తెరపై చూపించడంలో తడబడ్డాడు. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగున్నా మంచి థ్రిల్లింగ్ అనిపించినా ఓవరాల్ గా చూసినప్పుడు సినిమాలో ఏదో వెలితి కనిపిస్తుంది. చాలా సీన్లు అయితే లాజిక్ కు దూరంగా ఉంటాయి. సినిమా ఫస్ట్ ఆఫ్ లో మానవ అవయవాల అక్రమ రవాణా ఎపిసోడ్ టచ్ చేశారు. అది తల తోక లేకుండా అలాగే ఉండిపోయింది.

ఇక సినిమాటోగ్రఫీ నేపథ్య సంగీతం సినిమాకు స్పెషల్ ఎసెట్స్ గా ఉంటాయి. అలాగే నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కథ‌ నేపథ్యం సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు యాక్షన్ సన్నివేశాలు, నేపథ్య‌ సంగీతం సినిమాకు ఫ్ల‌స్ పాయింట్లుగా ఉంటే.. స్క్రీన్ ప్లే, పాటలు, లవ్ ట్రాక్, ఎడిటింగ్ మైనస్ గా కనిపిస్తాయి.

ఫైన‌ల్‌గా…
థ్రిల్ల‌ర్ ఎంజాయ్ చేసే వాళ్ల‌కు వ‌న్ టైం వాచ్‌బుల్ మూవీ

హిడింబ రేటింగ్‌: 2.5 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news