Movies"స్పై" మూవీ పబ్లిక్ రివ్యూ: నిఖిల్ చేసిన అతి పెద్ద మిస్టేక్...

“స్పై” మూవీ పబ్లిక్ రివ్యూ: నిఖిల్ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే..లేకపోతే సినిమా సూపర్ హిట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బోలెడూ మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ లెటేస్ట్ గా నటించిన సినిమా “స్పై” . ఈ మధ్య కాలంలో మంచి జోరు మీద ఉన్న విషయం తెలిసిందే. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటూ క్రేజీ టాక్ సంపాదించుకున్న నిఖిల్ .. స్పై తాజాగా నటించిన సినిమా కొద్దిసేపటి క్రితం థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను చూసి అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు .

కాగ కార్తికేయ 2 తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్ రొటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పై సినిమాతో మరోసారి పాజిటివ్ కామెంట్స్ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఫుల్ టు ఫుల్ యాక్షన్ ధ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ స్పై సినిమాకు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.

నేతాజీ ఫైల్స్ చుట్టూ తిరిగే ఈ కధ రొటీన్ కి భిన్నంగా ఉన్నా జనాలు ఆకట్టుకోలేకపోయింది. కథ బాగా రాసుకున్న ఆ కథను జనాలకు వివరించడంలో డైరెక్టర్ ఫ్లాప్ అయ్యాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్ధ్ తప్పిస్తే మిగతా నటీనటులు ఎవరు అంతగా సినిమాకి ప్లస్ కాలేదు అన్న కామెంట్లు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కొంతమందికి నచ్చినా.. మరి కొంతమంది జనాలకు అసలు నచ్చదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఇంటర్వెల్ లో అరుపులు పెట్టించడానికి.. క్యూరియాసిటీలు పెంచడానికి సినిమాలో ఏవి అలాంటి సీన్స్ ఉండవని ..సాఫ్ట్ గా కూల్ గా ముందుకెళ్ళిపోతూ ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి కొన్ని పాజిటివ్ కామెంట్స్ కొన్ని నెగటివ్ కామెంట్స్ తో నిఖిల్ సిద్ధార్ధ్ స్పై మూవీ సోషల్ మీడియాలో యావరేజ్ టాక్ దక్కించుకుంది. చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news