Moviesమరోసారి ఆ మ్యాటర్ ని ఫింగర్ పెట్టి కెలికిన అనసూయ.. రివేంజ్...

మరోసారి ఆ మ్యాటర్ ని ఫింగర్ పెట్టి కెలికిన అనసూయ.. రివేంజ్ మామూలుగా ఉండదుగా..!?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాంకర్ అనసూయ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఎప్పుడైతే అమ్ముడు విజయ్ దేవరకొండ గురించి ఓపెన్ అప్ గా మాట్లాడిందో .. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఆమెను ఆంటీ ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. రీసెంట్ గానే ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండపై ఎందుకు అంత యాంగ్రీ అనే ఫీలింగ్ కూడా చెప్పుకొచ్చింది .

ఈ విషయం ఇక్కడ ఆపేస్తే బెటర్ అని .. ఇకపై ఈ విషయం గురించి చర్చించుకోదల్చుకోవట్లేదు అంటూ కూడా కామెంట్ చేసింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా అనసూయ మరో బాంబు పేల్చింది. వరుస పెట్లతో తన మనసులోని మాటను వెల్లగక్కేసింది . ఈ క్రమంలోనే తాజాగా అనసూయ ట్విట్ చేస్తూ ..”అందరికీ నమస్కారం. నా నుంచి ఒక రిక్వెస్ట్ ..ఎందుకో తెలియదు కొన్ని రోజుల నుండి నాకు చాలా ట్వీట్స్ వస్తున్నాయి. రాజకీయ – సినీ పరిశ్రమలో ఇతరులను అగౌరవపరిచేందుకు నా పేరును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు “.

“ఈ క్రమంలోనే అందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను.. నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను కాబట్టి ఎవరి దారిలో వాళ్ళు వెళ్లడం మంచిది. నేను ఎవరి దారికి అడ్డురాను ..మీ అందరి నుండి ఒకటే అభ్యర్థన చేస్తున్నాను. నా సెల్ఫ్ మేడ్ విమెన్ ని నన్ను బతకనివ్వండి. నాకు అందరిలా పిఆర్ లు లేరు.. అందుకే నేను నా విషయాలు అన్ని నేనే మీకు చెబుతున్నాను. ప్లీజ్ నన్ను ప్రోత్సహించండి .. మీకు ఇష్టం లేకపోతే నా నుండి దూరంగా ఉండండి . అంతేకానీ ఏమాత్రం సంబంధం లేని విషయాలలో నా పేరును లాగి నన్ను ఇబ్బంది పెట్టకండి . నాకు ఓ ఫ్యామిలీ ఉంది ” అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో అనసూయ ట్విట్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news