Moviesఖచ్చితంగా ఆ రెండు ఉండాల్సిందే.. హీరోలకు హనీ రోజ్ క్రేజీ కండీషన్స్..!?

ఖచ్చితంగా ఆ రెండు ఉండాల్సిందే.. హీరోలకు హనీ రోజ్ క్రేజీ కండీషన్స్..!?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ లు  కండిషన్ పెట్టడం బాగా నేర్చుకున్నారు.  స్టార్ హీరోలకు సైతం కండిషన్లు పెడుతూ అలా చేయకూడదు.. ఇలా చేయకూడదు ..అలా ఉంటే మేము చేయము.. ఇలా ఉంటే మేము సినిమాలకు సైన్ చేయమంటూ మొండి  చేస్తున్నారు.  అసలు ఈ తంతు  మొదలైంది నయనతార దగ్గర నుంచే. సినిమా ఇండస్ట్రీలో ఇలా కండిషన్స్ పెట్టడం నేర్పించింది నయనతారనే.

నయనతార తన సినిమా ప్రమోషన్స్ కి రాను అంటూ ఇప్పటికీ డైరెక్టర్స్ కి చెప్పేస్తుందట . అలా అయితేనే అగ్రిమెంట్ పై సైన్ చేస్తాను అంటూ మొండిగా కూర్చునేస్తుందట.  అయితే ఆమెకున్న ఫాన్ ఫాలోయింగ్ దృష్ట్యా సినిమా ఇండస్ట్రీలో మేకర్స్ ఆమెను హీరోయిన్గా పెట్టుకుంటున్నారు.  ఇదే క్రమంలో రీసెంట్గా హనీ రో  సైతం సినిమా మేకర్స్ కు క్రేజీ కండిషన్స్ పెడుతుందట .

కచ్చితంగా సినిమాలో ఫస్ట్ లీడ్ పాత్ర ఉండాలి.. తన స్క్రీన్ స్పేస్ కనీసం అరగంట పైనే ఉండాలి ..ఆమె అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వాలి ..2 పాటలు ఉండాలి..ఫారన్ కంట్రీ షెడ్యూల్ కి వెళ్లితే  తనతోపాటు ఇంకొక వ్యక్తి వస్తారు అంటూ తన ఫ్రెండ్స్ ని కూడా షూట్ సెట్స్ కి తీసుకువచ్చి ఫుల్ గా లాగించేసి  బిల్ మొత్తం ప్రొడ్యూసర్స్ కి ఇచ్చేస్తుందట . ఇలాంటి కండిషన్స్ కి ఒప్పుకుంటేనే అమ్మడు సినిమాకు సైన్ చేస్తుందట.  లేకపోతే లేదట.  దీంతో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంటున్న  ఈ ముద్దుగుమ్మ ఇలాంటి కండిషన్స్ పెడుతుందా..? అంటూ ఆశ్చర్య పోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news