Moviesచరణ్-ఉపాసన పాప పేరు విన్నారా..? ఆ ముగ్గురు పేర్లు కలుపుతూ..మహాలక్ష్మికి గ్రాండ్...

చరణ్-ఉపాసన పాప పేరు విన్నారా..? ఆ ముగ్గురు పేర్లు కలుపుతూ..మహాలక్ష్మికి గ్రాండ్ వెల్కమ్..!!

ఫైనల్లీ కోట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్గా వెయిట్ చేసినా మూమెంట్ రానే వచ్చేసింది. మెగా కోడలు పిల్ల ఉపాసన డెలివరీ అయిపోయింది . మహాలక్ష్మి లాంటి పాపకు జన్మనిచ్చింది . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని కొద్ది గంటల క్రితమే అపోలో హాస్పిటల్స్ అధికారికంగా ధ్రువీకరించింది . మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన పండు లాంటి బేబీ గర్ల్ కి జన్మనిచ్చారు అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

అంతేకాదు డెలివరీ తర్వాత ఉపాసన పాప ఇద్దరు క్షేమంగా ఉన్నారని .. త్వరలోనే డిశ్చార్జ్ చేయబోతున్నాము అంటూ మెన్షన్ చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఉపాసన రాంచరణ్ లకు శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు అభిమానులు – ఫ్రెండ్స్ – ఫ్యామిలీ మెంబర్స్. ఇలాంటి టైంలోనే ఉపాసన రాంచరణ్ తన బేబీ గర్ల్ కు పెట్టిన పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

మొదటి నుంచి పాప పడుతుందని నమ్మకంతో ఉన్న చరణ్ – ఉపాసన పాప పుడితే ఒక పేరు.. బాబు పుడితే ఒక పేరు పెట్టుకోవాలని అనుకున్నారట . ఈ క్రమంలోనే బాబు పుడితే బాబాయ్ పేరు కలిసొచ్చేలా పవన్ తేజ్ అని పెట్టాలనుకున్నారట . ఒకవేళ పాప పుడితే వాళ్ళ ఇద్దరు అక్కలు.. ఉపాసన అమ్మగారు పేర్లు కలిసి వచ్చేలా “శ,సు,శ్రీ” పేరుని పెట్టాలని భావించారట . ఎట్టకేలకు ఉపాసనకు బేబీ గర్ల్ పుట్టడంతో ఫైనల్లీ వాళ్లు ఆ పేరుని కన్ఫామ్ చేస్తున్నారు అని తెలుస్తుంది.

ఉపాసన అమ్మ గారు శోభన పేరులోని రెండు అక్షరాలు.. పెద్ద అత్త పేరులోని మొదటి అక్షరం.. చిన్న అత్త పేరులోని మొదటి అక్షరం కలిసి వచ్చేలా “సుశ్రీ శోభ” అనే పేరుని అనుకున్నారట. అంతేకాదు తన నాన్న‌మా సురేఖ పేరు కూడా కలిసి వచ్చేలా ఇలా నేమ్ ని డిజైన్ చేశారట..!ఇదే క్రమంలో ఈ న్యూస్ నెట్టింట టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఫైనల్లీ మెగా ఫ్యామిలీలోకి మరో మెంబర్ వచ్చేసింది. మెగా ఇంట సంబరాలు షురూ అయ్యాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news