NewsNBK109 లో హీరోయిన్ ఎవరో తెలిసిపోయిందోచ్.. నందమూరి అభిమానులకు మంచి కిక్కెక్కించే...

NBK109 లో హీరోయిన్ ఎవరో తెలిసిపోయిందోచ్.. నందమూరి అభిమానులకు మంచి కిక్కెక్కించే న్యూస్ ఇది..!!

టాలీవుడ్ నటసింహం గా పాపులారిటీ సంపాదించుకొని ప్రజెంట్ గ్లోబల్ లయన్ గా ఇండస్ట్రీ రికార్డును తిరగరాస్తున్న నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వయసు పెరిగిపోతున్న కొద్ది బాలయ్యలో ఎనర్జీ లెవెల్స్ పీక్స్ కి చేరుకుంటున్నాయి . అందుకే బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ .. కమిట్ అయిన సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తూ.. హ్యూజ్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు .

కాగా రీసెంట్ గానే వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య .. ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” అనే సినిమాలో నటిస్తున్నాడు . కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా.. కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తుంది . ఈ సినిమా అయిపోగానే మెగా డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న బాబీ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు బాలయ్య . ఎన్ బి కే 109 హాష్ ట్యాగ్ టైటిల్ తో సెట్స్ పైకి త్వరలోనే వెళ్లబోతున్న ఈ సినిమాలో హీరోయిన్గా మిల్కీ బ్యూటీ తమన్నా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో సోషల్ మీడియాలో బ్యూటీ తమన్నా పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. అంతేకాదు ఈ మధ్యకాలంలో తమన్నా సీనియర్ హీరోల సరసన నటించేందుకు ఇష్టపడుతుంది . ఏది ఏమైనా సరే మాస్ హీరో బాలయ్య సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జత కడితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవ్వాల్సిందే అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. అంతేకాదు ఈ సినిమా మరో బ్యూటీ కూడా ఉందని..ఆ రోల్ కోసం శ్రియ శరణ్ ని అనుకుంటున్నారు మేకర్స్ అంటూ తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news