Newsచిరంజీవిని మించిన స్టార్ హీరో అవ్వాల్సిన ర‌మేష్‌బాబు కెరీర్‌కు దెబ్బ కొట్టింది...

చిరంజీవిని మించిన స్టార్ హీరో అవ్వాల్సిన ర‌మేష్‌బాబు కెరీర్‌కు దెబ్బ కొట్టింది ఎవ‌రు… ఏం జ‌రిగింది…!

అగ్ర‌హీరో.. సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు త‌న ఇద్ద‌రుకుమారులు ర‌మేష్‌, మ‌హేష్ అంటే.. పంచ ప్రాణాలు. ఇద్ద‌రినీ బాల న‌టులుగానే ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు. మ‌హేష్‌బాబు క‌న్నా ర‌మేష్ అందంగా ఉండేవాడ‌ని కృష్ణ చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. అయితే.. ర‌మేష్‌బాబు విష‌యంలో కృష్ణ పెట్టుకున్న ఆశ‌లు నెర‌వేర‌కుండా నే కృష్ణ కాలం చేశారు. మ‌రి అదేంటో చూద్దామా..

రమేష్ బాబు హీరోగా మొత్తం 15 చిత్రాల్లో నటించారు. ఇవి కాకుండా మరో మూడు జానపద చిత్రాల్లో ఆయన నటించారు. అయితే ఆ చిత్రాలు వివిధ కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయాయి. ఇవి విడుద‌లై ఉంటే.. ర‌మేష్‌బాబుకు స్టార్ డ‌మ్ వ‌చ్చేద‌ని.. కృష్ణ చాలా సంద‌ర్భాల్లో పేర్కొన్నారు. వాటిని విడుద‌ల చేయించేందుకు ఆయ‌న చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. కృష్ణ, రమేష్ బాబు హీరోలుగా 1996 సెప్టెంబర్‌లో ‘అహో విక్రమార్క’ షూటింగ్ మొదలైంది.

హీరో కృష్ణతో ‘జగదేక వీరుడు’ వంటి సోషియో ఫాంటసీ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయనకు ఇదే తొలి జానపద చిత్రం. రమ్యకృష్ణ స్పెషల్ క్యారెక్టర్ పోషించిన ఈ చిత్రంలో సత్యన్నారాయణ, సుధాకర్, తనికెళ్ల భరణి, ఆలి, మల్లికార్జునరావు, బాబూమోహన్ ఇతర తారాగణంగా ఎన్నికయ్యారు. రమేష్ బాబు సరసన కీర్తి, రక్ష కథానాయికలు.

పద్మాలయా స్టూడియోలో సెట్స్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేసి 1997 జనవరిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే రెండు షెడ్యూల్స్ అతి కష్టం మీద పూర్తి చేయగలిగారు నిర్మాతలు. రమేష్ బాబు మార్కెట్ కొంచం డల్‌గా ఉన్న సమయం అది. హీరో కృష్ణ సహాయ సహకారాలు అందించినా అడుగు ముందుకు వేయడం కష్టం అయింది. దీంతో అహో విక్రమార్క షూటింగ్ ఆగిపోయింది.

ఆ తర్వాత 1996లోనే రమేష్ బాబు హీరోగా ‘భూలోక రంభ’ మొదలైంది. జానపద బ్రహ్మ విఠలాచార్య తనయుడు శ్రీనివాస్ దీనికి దర్శకుడు. ఇందులో కథానాయికగా రంభ పాత్రకు ఇంద్రజ ఎంపికయ్యారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో జరిగింది. ఆర్థిక కారణాల వల్ల భూలోక రంభ షూటింగ్ కూడా ఆగిపోయింది. ఆ తర్వాత అంటే మూడేళ్ళ తర్వాత భూలోక రంభ చిత్రం పేరును మార్చి మళ్లీ అంటే 1999 జూన్ 24న షూటింగ్ ప్రారంభించారు.

ఆ సమయంలో ఇంద్రజ హీరోయిన్‌గా మంచి పొజిషన్‌లో ఉండడంతో ‘భూలోక వీరుడు జగదేక సుందరి’ అని టైటిల్ మార్చారు. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఈ షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే.. ఇవి విడుద‌లై ఉంటే.. ర‌మేష్‌కు మంచి పేరు వ‌చ్చేద‌ని కృష్ణ భావించినా.. అవి అలా మిగిలిపోయాయి. ఒక‌వేళీ సినిమాలు ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఆగిపోకుండా ఉండి ఉంటే ర‌మేష్‌బాబు ఆ రోజుల్లో ఖ‌చ్చితంగా చిరును మించిన స్టార్ హీరో అయ్యి ఉండేవాడ‌నే అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news