Newsఆ డైరెక్ట‌ర్‌పై మండిప‌డుతోన్న మ‌హేష్‌, చైతు… ఇలా అయితే కెరీర్ క్లోజ్...

ఆ డైరెక్ట‌ర్‌పై మండిప‌డుతోన్న మ‌హేష్‌, చైతు… ఇలా అయితే కెరీర్ క్లోజ్ అయిన‌ట్టే…!

టాలీవుడ్‌లో హీరోల‌కు, డైరెక్ట‌ర్ల‌కు మ‌ధ్య గొడ‌వ‌లు, పంతాలు, ప‌ట్టింపులు న‌డుస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ ప్రారంభ‌మ‌య్యాక కూడా ఇద్ద‌రికి తేడా రావ‌డంతో ఆగిపోయింది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల‌తో క‌మిట్ అయితే… త్రివిక్ర‌మ్‌.. మ‌హేష్‌బాబుతో క‌మిట్ అయ్యాడు. అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్‌.. మ‌హేష్‌బాబు ప్రాజెక్ట్ న‌డుస్తుండ‌గానే వీరి మ‌ధ్య కూడా స‌ఖ్య‌త లేద‌నే ప్ర‌చారం ఇండస్ట్రీలో న‌డుస్తోంది.

అయితే ఇప్పుడు ఓ యంగ్ డైరెక్ట‌ర్ పిచ్చి పిచ్చి ప‌నులు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోల ఆగ్ర‌హానికి గుర‌వుతున్న వాతావ‌ర‌ణం, చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీలో న‌డుస్తున్నాయి. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు ప‌ర‌శురాం. ప‌ర‌శురాంకు మ‌హేష్‌బాబుతో ఛాన్స్ వ‌చ్చింది. అయితే ఆ ఛాన్స్ ఉప‌యోగించుకోలేక‌పోయాడు. స‌ర్కారువారి పాట సినిమా మ‌హేష్ క్రేజ్ వ‌ల్లే ఆ మాత్రం అయినా ఆడింది.

సినిమా క‌థ‌లో పెద్ద‌గా ద‌మ్ములేదు. సెకండాఫ్ స‌రిగా డిజైన్ చేయ‌లేక‌పోయాడు ప‌ర‌శురాం. మ‌హేష్ లాంటి స్టార్ హీరోల‌ను తాను హ్యాండిల్ చేయ‌లేన‌న్న వైఫ‌ల్యం బ‌య‌ట పెట్టుకున్నాడు. సినిమా రిజ‌ల్ట్ వ‌చ్చాక మ‌హేష్ ప‌ర‌శురాంపై నువ్వు చెప్పింది ఏంటి ? తీసింది ఏంట‌ని ఫైర్ అయ్యాడ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇప్పుడు మ‌రో యంగ్ హీరో నాగ‌చైత‌న్య కూడా ప‌ర‌శురాంపై ఓపెన్‌గానే భ‌గ్గుమంటున్నాడు.

ప‌ర‌శురాంకు 14 రీల్స్ వాళ్లు భారీగా అడ్వాన్స్ ఇచ్చి మ‌రీ వ‌డ్డీలు క‌ట్టుకుంటున్నారు. అటు గీతా వాళ్ల ద‌గ్గ‌ర కూడా ప‌ర‌శురాం క‌మిట్‌మెంట్లు ఉన్నాయంటున్నారు. ఇలా ఎవ‌రి ద‌గ్గ‌ర ప‌డితే వాళ్ల దగ్గ‌ర అడ్వాన్స్‌లు తీసుకుని.. ఎవ్వ‌రికి సినిమా చేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాట్ట ప‌ర‌శురాం. ప‌ర‌శురాం ముందు నాగ‌చైత‌న్య‌తో సినిమా చేయాలి.. మ‌ధ్య‌లో చైతును వ‌దిలేసి మ‌హేష్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయాడు.

మ‌రోసారి చైతుతో సినిమా అంటూ హ‌డావిడి చేసి విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌గ్గ‌ర‌కు వెళ్లాపోయాడ‌ట‌. దీంతో చైతుకు చిర్రెత్తు కొచ్చిన‌ట్టు ఉంది. అస‌లు పరుశురామ్ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అంటున్నాడు చైతు. క‌స్ట‌డీ ప్ర‌మోష‌న్ల‌లో మాట్లాడుతూ ఆయ‌న నా టైం వేస్ట్ చేశాడు.. ఏం జ‌రిగిందో అంద‌రికి తెలుసు.. అస‌లు ఆ వ్య‌క్తి గురించి మాట్లాడుకోవ‌డ‌మే వేస్ట్ అంటూ ప‌ర‌శురాం పేరు చెప్పేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. చివ‌ర‌కు ప‌ర‌శురాం ప‌రిస్థితి ఇంత‌కు దిగ‌జారిపోయిన‌ట్టుగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news