Newsఓ మై గాడ్: రకుల్ అలాంటి జబ్బుతో బాధపడుతుందా..? అందుకే నీళ్లల్లో...

ఓ మై గాడ్: రకుల్ అలాంటి జబ్బుతో బాధపడుతుందా..? అందుకే నీళ్లల్లో అలా చేస్తుందా..!

అతి త‌క్కువ టైంలోనే టాలీవుడ్‌లో వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోలు అంద‌రితోనూ న‌టించి హిట్లు కొట్టేసింది ర‌కుల్‌ప్రీత్‌. 2015 – 2018 మ‌ధ్య‌లో ఆమె ఎన్టీఆర్‌, మ‌హేష్‌, బ‌న్నీ, చెర్రీ నుంచి టైర్ టు రేంజ్ హీరోల వ‌ర‌కు అంద‌రితోనూ ఏక‌ధాటిగా సినిమాలు చేసేసింది. ఆమెకు ఇక్క‌డ మ‌రింత కాలం కొన‌సాగే అవ‌కాశం ఉన్నా బాలీవుడ్ మోజులో ప‌డి చిన్న రాంగ్ స్టెప్ వేసింది. బాలీవుడ్‌లో ఆమెకు హిట్లు ప‌డ‌లేదు.. ఆ త‌ర్వాత ఆమె తిరిగి తెలుగులోకి వ‌చ్చినా అప్ప‌టికే ఆమెను లైట్ తీస్కోవ‌డం మొద‌లు పెట్టేశారు.

ఆ త‌ర్వాత త‌న ప్రియుడు భ‌గ్నానీతో క‌లిసి డేటింగ్‌లు అంటూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతోంది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫొటో షూట్ల‌తో ద‌ర్శ‌న‌మిస్తోంది. ఇప్పుడు వ‌య‌స్సు ముదురుతున్నా కూడా ర‌కుల్ ఇంకా సినిమాల్లో ఎవ‌రైనా ఛాన్సులు ఇస్తారేమో అంటూ మొత్తం విప్పి చూపించేందుకు కూడా వెనుకాడ‌ను అన్న‌ట్టుగా ఆమె ఫొటో షూట్లు ఉంటాయి.

తాజాగా ర‌కుల్ ఎముక‌లు కొరికే చ‌లిలో హీరోయిన్లు చేసిన ఫీట్ల‌ను మించి ఓ అదిరిపోయే ఫీట్ చేసింది. మైనస్ 15 డిగ్రీల టెంపరేచర్‌లో బాడీని పూర్తిగా క‌ప్పాల్సిందే. అస‌లు ఒంటిమీద చేతుల‌కు కూడా గ్లౌవ్స్ వేసుకోక‌పోతే వ‌ణికిపోతాం. అలాంటి ప్లేస్‌లో ర‌కుల్ అన్నీ పూర్తిగా విప్పేసింది. టూ పీస్ బికినీ వేసుకుని ర‌చ్చ చేసింది. బికినీతో బయటకొచ్చి, మంచు కింద ఉన్న నీటిలోకి దిగి… పీక‌ల్లోతు నీటిలో మునిగి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆ గ‌డ్డ‌క‌ట్టే చ‌లిలో ఆమె అలా దిగ‌డం నిజంగా పెద్ద సాహ‌స‌మే. దీనిని క్రియో థెరపీ అంటారు. ఈ థెర‌పీతోచర్మ సమస్యలు, కండరాలు-నరాల సమస్యలకు ప‌రిష్కారం దొరుకుతుంది. స‌మంత కూడా ఇటీవ‌ల గ‌డ్డ క‌ట్టుకుపోయిన ఐస్‌ల మ‌ధ్య‌లో ట‌బ్‌లో ఎలా ఉందో చూశాం. ఇప్పుడు ర‌కుల్ కూడా అలాగే చేస్తుండ‌డంతో ఆమె కూడా ఏదైనా స్కిన్ ప్రాబ్ల‌మ్ లేదా పైన చెప్పుకున్న స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుందా ? అన్న డౌట్లు నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news