Moviesఆ హీరోయిన్ కి కాల్ చేసి సారీ చెప్పిన తారక్.. అంత...

ఆ హీరోయిన్ కి కాల్ చేసి సారీ చెప్పిన తారక్.. అంత తప్పు ఏం చేసాడో తెలుసా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తాత పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన సరే ఏనాడు నందమూరి అనే ట్యాగ్ ను ఉపయోగించుకోకుండా సొంత టాలెంట్ తో కష్టపడి పైకి వచ్చిన నందమూరి జూనియర్ ఎన్టీఆర్.. ప్రెసెంట్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని హాలీవుడ్ డైరెక్టర్ లు సైతం ఎన్టీఆర్ తో సినిమాలు తీయ్యాలి అనుకునే స్దాయికి ఎదిగిపోయాడు. రీసెంట్ గానే హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ గన్ ఎన్టీఆర్ తో సినిమా తీయాలని ఉంది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .

అవకాశం వస్తే అలాంటి ఛాన్స్ మిస్ చేసుకోను అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రతి చిన్న న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఎంత సున్నిత గల మనస్తత్వం కలవాడు అనేది ప్రత్యేకంగా చెప్పడానికి ఓ ఎగ్జాంపుల్ ను వైరల్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా యమదొంగ. ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి – మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా నటించారు . ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా ప్రియమణి నటించగా .. రెండవ హీరోయిన్గా మమతా మోహన్ దాస్ నటించింది.

ఈ సినిమాలో తాత సినిమాలోని “ఓలమ్మి తిక్కరేగిందా..” అనే సాంగ్ ను రీమిక్స్ చేశారు . ఈ పాట సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది . అంతేకాదు ఈ పాటలో భాగంగా మమతా మోహన్ దాస్ బ్యాక్ ను వాయించి వదిలేసాడు తారక్. డైరెక్టర్ చెప్పిన కారణంగానే ఇలా చేశాడు అయినా కూడా ఎక్కడా ఆమె హార్ట్ అయిందో అని పాట కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి ఫోన్ చేసి మరి ఆమెకు సారీ చెప్పుకొచ్చారట .

అఫ్ కోర్స్ మమతా మోహన్ దాస్ అలాంటివి పట్టించుకోదు . కానీ మొదటి నుంచి సున్నిత మనస్తత్వం కల ఎన్టీఆర్ ఆమెకు కాల్ చేసి మరి సారీ చెప్పడంతో మమతా మోహన్ దాస్ ప్గిదా అయిపోయిందట . ఇంత పెద్ద హీరో ఇలాంటి విషయాలను ఇంత కేర్ఫుల్ గా గమనిస్తారా..? సో స్వీట్ అంటూ చెప్పకు వచ్చిందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news