Moviesశోభ‌న్‌బాబుతోనూ శ్రీదేవి ప్రేమాయ‌ణం… ఈ సీక్రెట్ ఎఫైర్ బ‌య‌ట‌ప‌డింది ఇలా…!

శోభ‌న్‌బాబుతోనూ శ్రీదేవి ప్రేమాయ‌ణం… ఈ సీక్రెట్ ఎఫైర్ బ‌య‌ట‌ప‌డింది ఇలా…!

తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక స్టేజ్ సృష్టించుకున్న శ్రీదేవి.. ఓల్డ్ నుంచి గోల్డ్ వ‌ర‌కు.. అంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి క‌ల‌ర్ వ‌ర‌కు అనేక సినిమాల్లో అగ్ర‌తార‌ల‌తో క‌లిసి న‌టించారు. ఎన్టీఆర్‌.. ఏఎన్నా ర్ ల‌తో క‌లిసి న‌టించిన ఆమె.. త‌ర్వాత కాలంలో వారి పిల్ల‌ల‌తోనూ హీరోయిన్‌గా న‌టించారు. అయితే.. అదే స‌మ‌యంలో త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల్లోనూ శ్రీదేవి న‌టించారు.

తెలుగులో న‌టించే స‌మ‌యంలో ఒక‌రితో ఆమె ప్రేమ‌లో పడ్డార‌నేది పెద్ద ఎత్తున సాగిన ప్ర‌చారం. ఆయ‌నే శోభ‌న్‌బాబు. ఇది చాలా ర‌హ‌స్యంగా ఉండిపోయింది. అయితే.. త‌ర‌చి చూస్తే..శోభ‌న్‌బాబుతో ఎక్కువ‌గా న‌టించిన హీరోయిన్ల‌లో శ్రీదేవి పేరు ముందు ఉంటుంది. శోభ‌న్‌బాబుతో న‌టించేందుకు అవ‌కాశం వ‌చ్చిన స‌మ‌యంలోనే బాలీవుడ్‌లో ఒక సినీ ఆఫ‌ర్‌వ‌చ్చింది. ఇక్క‌డే శ్రీదేవి ప్రేమ బ‌య‌ట ప‌డింద‌ని అంటారు.

శోభ‌న్‌తో క‌మిట్ అయ్యాను కాబ‌ట్టి ఆసినిమా ఒప్పుకోలేదు.. అని ఒక సారి శ్రీదేవి చెప్పారు. నిజానికి అప్ప‌టికి అడ్వాన్స్ తీసుకోలేదు. కానీ, శోభ‌న్ పై ప్రేమ‌తోనే ఆమె వ‌దుల‌కున్నార‌ని..గ్యాసిప్‌లు వ‌చ్చాయి. ఇక‌, శోభ‌న్‌బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది. ఆయ‌న ఇలాంటి విష‌యాల‌పై చాలా మౌనంగా ఉంటా రు. అస‌లు మీడియాను చెంత‌కు రానివ్వ‌రు. రాసుకోండోయ్‌.. మీ ఇష్టం! అని అనేసి వెళ్లిపోయేవారు.

చాలా డిసిప్లిన్‌గా ఉండే.. శోభ‌న్‌బాబుపై అనేక వార్త‌లు వ‌చ్చేవి. కానీ, ఆయ‌న మాత్రం ప‌ట్టించుకునేవారు కాదు. ఎప్పుడూ.. బ‌య‌ట‌పడేవారు కాదు. అయితే.. నిజ‌మైన ప్రేమ‌ను దాచి పెట్టేందుకు.. ఇలా శ్రీదేవితో ఎఫైర్ ఉన్న‌ట్టు శోభ‌న్‌బాబు అంటే.. ఇష్ట‌ప‌డే కొంద‌రు అభిమానులే ఈ వార్తలు సృష్టించార‌నే ప్ర‌చారం కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి శ్రీదేవి మాత్రం శోభ‌న్ అని పిల‌వ‌డం.. ఆయ‌న‌సినిమాలే తాను ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్ప‌డం.. కొస‌మెరుపు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news