Moviesసురేఖ‌వాణి ఆ ఒక్క కార‌ణంతోనే రెండో పెళ్లికి రెడీ అవుతోందా... క్లారిటీ...

సురేఖ‌వాణి ఆ ఒక్క కార‌ణంతోనే రెండో పెళ్లికి రెడీ అవుతోందా… క్లారిటీ ఇచ్చేసింది…!

టాలీవుడ్ లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గత రెండు దశాబ్దాలుగా ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే సురేఖవాణి మంచి స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన లక్షణాలు ఉన్న అమ్మాయి. అయితే దురదృష్టవశాత్తు ఆమెకు కావలసిన అందంతో పాటు అభినయం.. హీరోయిన్ కు కావలసిన లక్షణాలు, పర్సనాలిటీ పుష్కలంగా ఉన్నా ఆమె కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలే వేస్తూ వస్తున్నారు.

సురేఖ వాణి వేసే స్పెషల్ క్యారెక్టర్లు, ఆమె పాత్ర నుంచి పుట్టే కామెడీ అంటే తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడేవారు. అయితే ఆమె కెరీర్ అంతా బాగుంది అనుకుంటున్న టైంలో సురేఖ వాణి భర్త హఠాన్మరణం చెందారు. భర్త లేరన్న బాధ నుంచి ఆమె కోలుకుని తిరిగి కెరీర్ ప‌రంగా యాక్టివ్ అయ్యారు. ఇక సురేఖ వాణి తన కూతురు సుప్రీత‌తో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చకు అంతే ఉండదు. అసలు వీరిద్దరిని పక్కపక్కన చూస్తుంటే.. వీరిద్దరూ చేసే అల్లరి, ఆ రచ్చ చూస్తుంటే వీరిద్దరూ తల్లి కూతుర్లు కాదు.. బెస్ట్ ఫ్రెండ్సా ? లేక అక్కాచెల్లెళ్లా ? అన్నట్టుగా ఉంటుంది.

ఇక త‌న కుమార్తె సుప్రీత‌ను టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేసేందుకు గ‌త కొంత కాలంగా సురేఖ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా స‌రైన ఛాన్సులు రావ‌డం లేదు. చిన్నా చిత‌కా హీరోల ప‌క్క‌న ఆమె న‌టింప‌జేసేందుకు సురేఖ ఒప్పుకోవ‌డం లేద‌ట‌. ఇదిలా ఉంటే సురేఖ వాణి ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అవుతున్న‌ట్టే తెలుస్తోంది. సురేఖ కుమార్తె సుప్రీత కూడా త‌న త‌ల్లికి ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లి చేయాల‌ని గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు అయితే మొద‌లు పెట్టిందంటున్నారు.

ఇటు సురేఖ‌కు ఇంకా చాలా భ‌విష్య‌త్తు ఉంది. దీనికి తోడు సుప్రీత‌కు కూడా పెళ్లి చేయాల్సిన బ‌రువు, బాధ్య‌త‌లు కూడా ఆమెపై ఉన్నాయి. సుప్రీత పెళ్లి త‌ర్వాత అయినా సురేఖ‌వాణి మంచి చెడ్డ‌లు చూసుకునేందుకు ఈ వ‌య‌స్సులో ఆమెకు ఓ తోడు అవ‌స‌రం.. ఆమెకు ఇంకా చాలా ఫ్యూచ‌ర్ ఉంది. ఇవ‌న్నీ ఆలోచించే ఆమె కూడా మ‌ళ్లీ పెళ్లికి రెడీ అవుతున్న‌ట్టే తెలుస్తోంది. అయితే ఈ సారి త‌న‌కు భ‌ర్త‌గా వ‌చ్చే వ్య‌క్తి త‌న ప‌రిస్థితుల నేప‌థ్యంలో అన్నివిధాలా అర్థం చేసుకునేవాడే అయ్యి ఉండాల‌ని… అలాంటి వ్య‌క్తి కోస‌మే ఈ త‌ళ్లీకూతుళ్లు ఇప్పుడు వేట మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news