Moviesఅల్లు అర్జున్ అంటే అంత కోపమా..? పిచ్చి పట్టింపులతో బ్లాక్ బస్టర్...

అల్లు అర్జున్ అంటే అంత కోపమా..? పిచ్చి పట్టింపులతో బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్న స్టార్ హీరో..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా జులాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 9 ఆగస్టు 2012 గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సంపాదించుకుంది . అంతే కాదు అల్లు అర్జున్ కెరియర్ లోనే ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ గా రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ పుష్ప సినిమా అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకునేలా చేసింది .

అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా “జూలాయి”. అంతేకాదు ఈ సినిమాలో హీరో బన్నీ ఎంత పేరు సంపాదించుకున్నాడో..అంతే పేరు సంపాదించుకున్నాడు జులాయి సినిమాలో విలన్ రోల్ లో నటించిన సోనూసూద్. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ – సోనసూద్ కాంబోలో వచ్చిన సీన్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో ఓ రేంజ్ లో చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు జనాలు .

అయితే నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఈ సినిమాల్లో విలన్ రోల్ కోసం కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ను అప్రోచ్ అయ్యారట . అయితే ఎందుకో తెలియదు కానీ కథ విన్న తర్వాత ఓకే చెప్పిన విశాల్.. ఇందులో హీరో అల్లు అర్జున్ అని తెలుసుకున్న తర్వాత కాల్ షీట్స్ లేవు అంటూ స్కిప్ చేశారట.

ఈ క్రమంలోని ఎప్పటి నుండో అల్లు అర్జున్ – విశాల్ మధ్య బిజినెస్ డీల్స్ ఫెయిల్ అయిన కారణంగా మాటల్లేవ్ అన్న విషయం బయటపడింది. అప్పుడే ఫుల్ క్రేజ్ తో ఉన్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సోనూసూద్ ని సినిమాలో విలన్ గా తీసుకున్నారు . ర మాటకు ఆ మాట..ఈ సినిమాలో విశాల్ కన్న ఈ పాత్ర కి సోనూసూద్ నే న్యాయం చేసాడు. ఇప్పటికి రియల్ హీరోగా అభిమానుల గుండెల్లో చెరగని స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు సోనూసూద్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news