Newsఒక్క నైట్ అంటే స‌మంత నో చెప్పింది... ఆమె రేటు కూడా...

ఒక్క నైట్ అంటే స‌మంత నో చెప్పింది… ఆమె రేటు కూడా ఎక్కువే… టాలీవుడ్ డైరెక్ట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

స‌మంత తాజాగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన శాకుంత‌లం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై సామ్ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. అయితే శాకుంత‌లం స‌మంత కెరీర్‌లోనే ఎపిక్ డిజాస్ట‌ర్ దిశ‌గా దూసుకు వెళుతోంది.. దీంతో స‌మంత‌పై సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే స‌మంత తెలుగులో 2010లో వ‌చ్చిన నాగ‌చైత‌న్య ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది.

ఈ సినిమాకు గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత స‌మంత వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ త‌ర్వాత త‌న తొలి సినిమా హీరో నాగ‌చైత‌న్య‌నే ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల కాపురం త‌ర్వాత ఈ జంట విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఎవ‌రి దారుల్లో వారు బ‌తుకుతున్నారు.

ఇదిలా ఉంటే స‌మంత‌పై సీనియ‌ర్ డైరెక్ట‌ర్ శివ నాగేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమెను హీరోయిన్‌గా తానే ప‌రిచ‌యం చేయాల్సి ఉన్నా కొన్ని కార‌ణాల వ‌ల్ల అది మిస్ అయ్యింద‌న్నారు. స‌మంత చెన్నైలోని సెయింట్ మేరీస్ కాలేజ్‌లో చ‌దువుతున్న‌ప్పుడు ఆమెను త‌న సినిమాలో ఆడిష‌న్స్ కోసం హైద‌రాబాద్ పిలిపించామ‌న్నారు.

ఆడిష‌న్స్ ముగిశాక‌… ఆ రోజు విమాన టిక్కెట్లు చాలా త‌క్కువుగా ఉన్నాయి.. పైగా అప్ప‌ట్లో టిక్కెట్ రేట్లు చాలా ఎక్కువ… ఒక్క రోజు హైద‌రాబాద్‌లో ఉంటే మ‌రుసటి రోజు చెన్నై పంపుతామ‌ని చెప్పినా ఆమె వినిపించుకోలేద‌ని నాగేశ్వ‌రావు తెలిపారు. చేసేదేమి లేక టిక్కెట్ రేటు ఎక్కువ అయినా అదే రోజు ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసి ఆమెను చెన్నై పంపిన‌ట్టు చెప్పారు.

ఇక స‌మంత‌ను త‌న సినిమాలో హీరోయిన్‌గా తీసుకుందామ‌ని కూడా అనుకున్నామ‌ని.. అయితే ఆమె చాలా ఎక్కువ రెమ్యునరేష‌న్ డిమాండ్ చేయ‌డంతో ఆమె ప్లేస్‌లో మ‌రో హీరోయిన్‌ను తీసుకున్న‌ట్టు చెప్పారు. ఇక హీరోయిన్ అంజ‌లిని ఆయ‌నే ఫొటో సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news