Moviesరాజ‌మౌళి త‌ర్వాత మ‌హేష్ నెక్ట్స్ సినిమా అత‌డితోనే... అఫీషియ‌ల్ క్లారిటీ..!

రాజ‌మౌళి త‌ర్వాత మ‌హేష్ నెక్ట్స్ సినిమా అత‌డితోనే… అఫీషియ‌ల్ క్లారిటీ..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మై నెల‌లు గ‌డుస్తున్నా ఇప్ప‌ట‌కీ రెగ్యుల‌ర్ షూటింగ్ అనుకున్నంత స్పీడ‌ప్ అవ్వ‌లేదు. పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల రెండో హీరోయిన్‌.

ఇక త్రివిక్ర‌మ్ సినిమా పూర్త‌యిన వెంట‌నే మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంది. ఈ సినిమా కోసం రాజ‌మౌళి.. మహేష్ డేట్స్‌ను యేడాది పాటు బ్లాక్ చేసి పెట్టాడా ? లేదా రెండేళ్లు ప‌డుతుందా ? అన్న‌ది ఎవ్వ‌రూ చెప్ప‌లేము. ఇక దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కేఎల్‌. నారాయ‌ణ నిర్మించే ఈ సినిమా రు. 500 కోట్లు బ‌డ్జెట్ అంటున్నా.. ఇది పూర్త‌య్యే స‌రికి మ‌రో రు. 100 – 200 కోట్లు పెరుగుతుంద‌నే అంటున్నారు.

అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే కథ మొత్తం ఉంటుంద‌ట‌. వ‌చ్చే మార్చి నుంచి షూటింగ్ జ‌రుగుతుంద‌ని అంటున్నారు. అంటే 2024 మార్చి అంటే ఈ సినిమా రిలీజ్ 2026 మార్చిలో ఉండొచ్చు. అంటే మ‌రో రెండున్న‌రేళ్ల పాటు మ‌హేష్ ఖాళీగా ఉండ‌డు. మ‌రి ఈ క్రేజీ సినిమా త‌ర్వాత మ‌హేష్ నెక్ట్స్ సినిమా ఎవ‌రితో ? ఉంటుంద‌న్న‌ది కూడా అప్పుడే అఫీషియ‌ల్‌గా క్లారిటీ వ‌చ్చేసింది.

రాజ‌మౌళి త‌ర్వాత మ‌హేష్ నెక్ట్స్ సినిమా ఏకే ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్లో అనిల్ సుంక‌ర‌కు చేస్తారు. ఈ విష‌యాన్ని అనిల్ స్వ‌యంగా చెప్పారు. అయితే ద‌ర్శ‌కుడు ఎవ‌రు ? అన్న‌ది మాత్రం ఇంకా ఖ‌రారు చేయ‌లేద‌ని చెప్పారు. మ‌హేష్‌తో వంశీ పైడిప‌ల్లి, అనిల్ రావిపూడి సినిమాలు చేసేందుకు క‌మిట్ అయ్యారు. మ‌రి వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ఫైన‌ల్ అవుతారా ? లేదా మ‌హేష్‌కు గ్లోబ‌ల్ ఇమేజ్ వ‌స్తే ద‌ర్శ‌కుడు మార‌తారా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news