Moviesఎన్టీఆర్ - సాయితేజ్ బెస్ట్ ఫ్రెండ్సా… ఎట్ట‌కేల‌కు బ్రేక‌ప్‌పై నోరు విప్పాడుగా…!

ఎన్టీఆర్ – సాయితేజ్ బెస్ట్ ఫ్రెండ్సా… ఎట్ట‌కేల‌కు బ్రేక‌ప్‌పై నోరు విప్పాడుగా…!

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకుని ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో విరూపాక్ష మూవీలో హీరోగా నటిస్తున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌తో పాటు రీసెంట్‌గా ట్రైల‌ర్ కూడా రిలీజ్ అయ్యింది.

వీరూపాక్ష ట్రైల‌ర్ ఎంతో ఆస‌క్తితో ఉంది. ట్రైల‌ర్ తో సినిమాపై ఉన్న అంచ‌నాలు ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. ఈ నెల 21న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో సాయితేజ్ ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెల్ల‌డించారు. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు, త‌న‌కు మ‌ధ్య ఉన్న స్నేహం గురించి తెలిపారు.

మెగాఫ్యామిలీ త‌ర్వాత త‌న‌కు ఎన్టీఆర్ ఎంతో మంచి స‌పోర్ట‌ర్ అని… ఎన్టీఆర్ సినిమాల్లోకి రాక‌ముందు నుంచే త‌న‌కు ఎన్టీఆర్‌కు మ‌ధ్య స్నేహం ఉండేద‌ని.. కెరీర్ బిగినింగ్‌లో ఎన్టీఆర్ త‌న‌కు ఎంతో మంచి స‌పోర్ట్ ఇచ్చార‌ని.. అది ఇప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేనని సాయితేజ్ తెలిపాడు. ఒరేయ్ తేజుగా, నువ్వు హ్యాపీగా ఉండాలిరా.. మంచి హిట్ సినిమాలు చేయాల్రా అంటూ సపోర్ట్ చేసేవాడ‌ని కూడా తేజ్ గుర్తు చేసుకున్నాడు.

ఇక ఎన్టీఆర్ తో పాటు మ‌రో నంద‌మూరి హీరో కల్యాణ్ రామ్ కూడా తనను బాగా సపోర్ట్ చేసేవాడని.. ఇద్దరూ తనకు మంచి స్నేహితులన్నాడు. ఇక ప్రేమ‌, పెళ్లి గురించి మాట్లాడుతూ అమ్మాయిలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటూనే.. తాను ప్రేమ‌లో ప‌డ్డాన‌ని.. ఓ బ్రేక‌ప్ కూడా అయ్యింద‌న్నాడు. అయితే ఆమె ఎవ‌రో చెప్ప‌క‌పోయినా రెజీనాతోనే సాయితేజ్ ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని.. త‌ర్వాత ఇద్ద‌రికి బ్రేక‌ప్ జ‌రిగిందంటూ ప్ర‌చారం కూడా జ‌రిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news