MoviesNTR 30లో జాన్వీక‌పూర్ రోల్ లీక్ అయ్యింది… చేప‌లు ప‌ట్టే సీన్లో...

NTR 30లో జాన్వీక‌పూర్ రోల్ లీక్ అయ్యింది… చేప‌లు ప‌ట్టే సీన్లో రొమాన్స్ అదురుతుందా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా వస్తున్న ఈ సినిమా మైథాలజికల్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కథ ఎలా ? ఉండబోతుందో దర్శకుడు కొరటాల శివ ఎప్పటికీ లీక్ చేసేసారు. ఇక ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా కావటం.. ఇటు దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ తొలిసారి దక్షిణాదిలో.. అందులోనూ టాలీవుడ్ లో నటిస్తున్న సినిమా కావడంతో.. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ?
ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా లైన్ ఎలా ? ఉండ‌బోతోందో ఇప్ప‌టికే చెప్పిన కొర‌టాల ఇప్పుడు హీరోయిన్ జాన్వీక‌పూర్ రోల్‌పై కూడా హింట్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో జాన్వీక‌పూర్ ఓ మ‌త్స్య‌కారుడి కుమార్తెగా న‌టిస్తోంది. పాత్ర‌లో అదిరిపోయే రొమాన్స్ ఉంటుంద‌ని.. చేప‌లు ప‌ట్టే టైంలో ఆమె మ‌త్స్య‌కార ప‌డుచుగా కాస్ట్యూమ్స్ వేసుకున్నప్పుడు, అదే టైంలో ఎన్టీఆర్‌తో ఆమె చేసే రొమాన్స్ మామూలుగా ఉండ‌ద‌ని.. ప్రేక్ష‌కులు పిచ్చ‌పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తారంటున్నారు.

ఇక జాన్వీ సౌత్‌లో చేస్తోన్న తొలి సినిమా ఇదే కావ‌డం.. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ప‌క్క‌న చేస్తుండ‌డం.. ఇది ఆమెకు తొలి పాన్ ఇండియా సినిమా కావ‌డంతో ఈ ప్రాజెక్టు కోసం చాలా కాన్‌సంట్రేష‌న్‌తో వ‌ర్క్ చేస్తోంద‌ని కూడా చెపుతున్నారు. ఇక వ‌చ్చే ఏప్రిల్లో రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేయ‌డంతో ఈ సినిమా కోసం కొర‌టాల చాలా లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ లుక్ కూడా చాలా కొత్త‌గా ఉండ‌నుంది. త‌న లుక్‌కు త‌గ్గ‌ట్టుగానే ఎన్టీఆర్ ఫిజిక్ మార్చుకుంటున్నాడు. ఇక ఆచార్య ప్లాప్ అవ్వ‌డంతో కొరటాల క‌సితో ఈ సినిమా కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. గ‌తంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచ‌నాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news