Moviesప‌వ‌న్ - సాయితేజ్ సినిమాకు అదిరిపోయే టైటిల్‌... ప‌క్కా క్లాసిక‌ల్‌గా ఫిక్స్‌..!

ప‌వ‌న్ – సాయితేజ్ సినిమాకు అదిరిపోయే టైటిల్‌… ప‌క్కా క్లాసిక‌ల్‌గా ఫిక్స్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిలో క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు – సుజిత్ దర్శకత్వంలో ఓజీ – హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలతో పాటు కోలీవుడ్ హిట్ సినిమా వినోదయ సితం సినిమా రీమేక్‌లో కూడా పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ప్రముఖ తమిళ‌ నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా. ఈ సినిమాకు తెరవెనక అన్ని తానే వ్యవహరిస్తున్నారు త్రివిక్రమ్.

కథలో కీలకమైన మార్కులతో పాటు స్క్రీ న్ ప్లే, డైలాగ్స్ అన్ని త్రివిక్రమ్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఓవైపు అటు మహేష్ బాబుతో తాను తెర‌కెక్కించే సినిమా ఆలస్యం అవుతున్నా త్రివిక్రమ్ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా పవన్ సినిమా మీద ఉందన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను జూలై 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. పవన్ కంటిన్యూగా 25 రోజులు పాటు కాల్ సీట్లు ఇవ్వడంతో.. పవన్ నటించిన పార్ట్ అంతా కంప్లీట్ అయింది.

ఈ సినిమాకు త్రివిక్రమ్ క్లాసిక‌ల్ టైటిల్‌ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ కు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఈ నెలలోనే పవన్ – సాయితేజ్ టైటిల్ రిలీజ్‌ అవబోతుందని తెలుస్తోంది. అదేరోజు పవన్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడుగా కనిపించనున్నాడు. అయితే సినిమాలో పవన్ ను దేవుడిగా చూపించరు.. గెటప్ కూడా అలా ఉండదని తెలుస్తోంది.

ఈ సినిమాలో పవన్ ఫేమస్ డైలాగ్ నేను కాలాన్ని.. అంటే కాలాన్ని వెనక్కి తిప్పి సాయిధరమ్ తేజ్‌కు జీవితంలో మరో ఛాన్స్ ఇచ్చే పాత్రలో పవన్ కనిపించనున్నాడని తెలుస్తోంది. కేతిక శర్మ – ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జి స్టూడియో సంస్థ సహానిర్మాతగా వ్యవహరిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news