Moviesబాల‌య్య సినిమా డిజిట‌ల్ రైట్స్ డీల్ క్లోజ్‌... న‌ట‌సింహం దెబ్బ‌తో మ‌రో...

బాల‌య్య సినిమా డిజిట‌ల్ రైట్స్ డీల్ క్లోజ్‌… న‌ట‌సింహం దెబ్బ‌తో మ‌రో రికార్డ్ బ్రేక్‌..!

గత రెండేళ్లుగా బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతుంది. అఖండ సూపర్ డూపర్ హిట్ అవ్వటం అన్నది వీర‌సింహారెడ్డి సినిమాకి బాగా కలిసి వచ్చింది. దీనికి తోడు వీరసింహారెడ్డి సినిమా పండగ సీజన్లో రావడంతో మరొక ప్లస్ అయింది. అందుకే అఖండ కంటే కాస్త యావరేజ్ టాక్ వచ్చినా కూడా వీరసింహారెడ్డి అఖండ‌ను మించి అదిరిపోయే వసూళ్లు కొల్లగొట్టింది. దీనికి తోడు ఆహాలో అన్‌స్టాప‌బుల్‌ టాక్ షో కూడా దుమ్ము రేపుతోంది. ఇవన్నీ కలిసి ఇప్పుడు బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న బాలయ్య 108వ సినిమాకు ప్లస్ అవుతున్నాయి.

బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక శ్రీలీల‌ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కూడా మరో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఇవ‌న్ని కలిసి ఈ సినిమాకు అదిరిపోయే హైప్‌ తీసుకు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతోంది. ఇప్పటికీ డిజిటల్ హక్కులను మంచి ఫ్యాన్సీ రేట్ కు అమ్మేశారు. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు రు. 36 కోట్లు ఇచ్చి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇది న‌ట‌సింహం కెరీర్‌లోనే టాప్‌. సినిమా బిజినెస్ ఇంకా ఓపెన్ చేయలేదు. అలాగే శాటిలైట్, హిందీ డబ్బింగ్, ఆడియో రైట్స్ చేతిలో ఉన్నాయి, ఇక ఈ సినిమాకు రు. 100 కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది. అందుకే నాన్ థియేటర్ మీద కనీసం రు. 60 నుంచి 70 కోట్ల వరకు వస్తాయని మేకర్లు అంచనా వేస్తున్నారు. అప్పుడే థియేటర్ మీద కాస్త భారం తగ్గుతుందని అంటున్నారు. ఇటు బాలయ్య వరుసగా సూపర్ డూపర్ హిట్టులతో ఫామ్ లో ఉన్నాడు.

అటు అనిల్ రావిపూడి కూడా ఏకంగా ఆరు వరుస హిట్లు కొట్టి టాలీవుడ్ లోనే మంచి పాపులర్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఇటు కాజల్, శ్రీలీల మంచి ఫామ్ లో ఉన్నారు. రెమ్యూనరేషన్ లో ఎక్కువగా ఉండటం.. ఇక భారీ సెట్ కూడా వేయాల్సి రావడంతో సినిమాకు బడ్జెట్ రు. 100 కోట్లకు కాస్త అటు ఇటుగా అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 19 లేదా 21న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news