Moviesముచ్చటగా మూడోసారి.. వరుసగా మూడుసార్లు పెటాకులు అయిన తెలుగు స్టార్ హీరో...

ముచ్చటగా మూడోసారి.. వరుసగా మూడుసార్లు పెటాకులు అయిన తెలుగు స్టార్ హీరో పెళ్లి..!?

టైం బాగోలేకపోతే ఎప్పుడు.. ఎలా.. ఏదైనా.. జరగొచ్చు అంటుంటారు పెద్దలు . బహుశా ఈ టాలీవుడ్ స్టార్ హీరో విషయంలో అదే జరిగినట్లు ఉంది . లేకపోతే ముచ్చటగా మూడుసార్లు పెళ్లిని పెటాకులు చేసుకోవడం అంటే మాటలా..? ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ ..పెళ్లి మూడుసార్లు వాయిదా పడిందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు .

ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ పెళ్లి మూడుసార్లు వాయిదా పడిందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలోకి హీరోగా రాకముందే సాయి పెళ్లి చేసుకోవాల్సి ఉందట . అమ్మ ఫోర్స్ తో సాయి పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడని కానీ కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆ పెళ్లి అప్పుడే ఆగిపోయినట్లు తెలుస్తుంది.

ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోయిన్ గా వచ్చాక .. టాప్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపిన ఈ హీరో ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి నానా తంటాలు పడిందట. పెళ్లికి ఇంట్లో వాళ్ళను ఒప్పించారట . పెళ్లి టైంకి ఆ హీరోకి యాక్సిడెంట్ అవ్వడంతో అశుభం అంటూ అమ్మగారు అమ్మాయిని రిజెక్ట్ చేసారట . ముచ్చటగా మూడోసారి మెగా ఫ్యామిలీకి క్లోజ్ గా ఉండే రిలేటివ్ తో సాయి పెళ్లి చేయడానికి మెగా ఫ్యామిలీ డిసైడ్ అయ్యిందట . అయితే అంతలోనే మెగా డాటర్ నిహారిక డివోర్స్ తీసుకోబోతుంది అని తెలియడంతో ఇది సరైన సమయం కాదు అంటూ సాయిధరమ్ తేజ్ వాళ్ళ అమ్మగారు ఈ పెళ్లిని వాయిదా వేశారట . ఇలా ముచ్చటగా మూడుసార్లు తన పెళ్లి పెటాకులు చేసుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా తన పేరున ట్రెండ్ చేసుకుంటున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news